Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ రెండు వారాల్లో బల్లులు కింద పడితే...?

సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతా ఉంటాయి. ఈ బల్లులు గోడలపై పాకుతూ అప్పుడప్పుడు కింద పడటం సహజం. ప్రమాదవశాత్తు బల్లిని తాకినా, అది మీద పడినా వెంటనే స్నానం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అలాగే కాంచీపురం క్షేత్రంలో గల వెండిబల్లిని, బంగారు బల్

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2018 (20:11 IST)
సాధారణంగా ప్రతి ఇంట్లో గోడలపై బల్లులు పాకుతా ఉంటాయి. ఈ బల్లులు గోడలపై పాకుతూ అప్పుడప్పుడు కింద పడటం సహజం. ప్రమాదవశాత్తు బల్లిని తాకినా, అది మీద పడినా వెంటనే స్నానం చేస్తే ఆ దోషం పరిహారం అవుతుంది. అలాగే కాంచీపురం క్షేత్రంలో గల వెండిబల్లిని, బంగారు బల్లిని పూజించి వస్తే బల్లి వల్ల కలిగే దోషాలు అంటవంటుంటారు. మరికొందరు బల్లి పడిన వెంటనే కాంచీపురంలో బల్లుల్ని పూజించి వచ్చిన వారిని తాకితే దోషం పోతుందని విశ్వాసం. 
 
బల్లి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పడితే ఫలితాలు ఎలా వుంటాయో చూద్దాం. ఇంటి మధ్యభాగంలో గురు - శుక్ర వారాలు మినహా మిగిలిన ఏ వారంలోనైనా బల్లి క్రిందపడినా, పలికినా చాలా శ్రేయస్కరము... కార్యసిద్ధి. ఇంటిలోని తూర్పు భాగంలో ఆది - గురువారాలు మినహా మిగతా అన్ని వారాల్లో బల్లి పడటం, పలకటం శుభప్రదం. ధనలాభం కలుగుతుంది. 
 
ఈ విధంగానే ఆది-సోమవారాలు మినహా ఇంట్లో ఆగ్నేయ భాగంలో బల్లి కింద పడ్డా లేదంటే అరిచినా నూతన వస్తులాభం, బంధువుల రాక, సోమ-మంగళ బుధవారాలు తప్ప మిగిలిన వారాలలో దక్షిణ దిక్కునందు పడితే సుఖము-భూషణ ప్రాప్తి, సోమ, మంగళ, బుధ, శనివారాలు మినహా వారాల్లో నైరుతి దిక్కుగా పడినట్లయితే సర్వకారకసిద్ధి, బంధు దర్శనము కలుగుతుంది. 
 
ఆది, బుధ, గురువారాలు కాక మిగిలిన వారాలలో ఇంట్లో పడమర దిక్కుగా శకునం కలిగిన అనుకూలత్వం, నూతన వస్త్రప్రాప్తి, సోమ బుధ శుక్ర వారాలు తప్ప మిగిలిన వారాల్లో ఇంట్లో వాయువ్య దిక్కులో శకునం కలిగినట్లైతే శుభవార్తలు, స్త్రీ సల్లాపము, ఆనందము కలుగుతుంది.
 
ఆది, మంగళ, గురు, శుక్రవారాలు కాక మిగిలిన వారాల్లో ఇంట్లో ఉత్తర దిక్కుగా శకునం కలిగిన సుఖము, లాభము, ప్రియ వార్తలు వినడం జరుగుతుంది. బుధ, శుక్ర, శనివారాలు మినహా మిగిలిన వారాల్లో ఇంట్లోని ఈశాన్య భాగంలో శకునం కలిగిన యెడల లాభము, వాహనప్రాప్తి, కలిసివచ్చుట జరుగును. ఇంటికి పైభాగంలో బల్లి పలుకు వినిపించిన యెడల (సోమ, గురువారాలు కాక) జయము, ప్రయాణము, శుభము అనునవి జరుగలవని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

08-07- 2025 మంగళవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు

Garuda Vahana Seva: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూలైలో రెండు సార్లు గరుడ వాహన సేవ

07-07-2025 సోమవారం దినఫలితాలు - పట్టుదలతో వ్యవహరించండి...

06-07-2025 ఆదివారం దినఫలితాలు - భేషజాలకు పోవద్దు.. చాకచక్యంగా వ్యవహరించాలి...

Ekadashi: తొలి ఏకాదశి రోజున ఇవి చేయకండి.. ఇతరులతో అది వద్దు?

తర్వాతి కథనం
Show comments