Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 13, 27న శని త్రయోదశి: శనీశ్వరుని అర్చించండి

PA Raman
సోమవారం, 8 సెప్టెంబరు 2008 (16:22 IST)
శని త్రయోదశి సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది. అలాగే అతిముఖ్యంగా వృషభ, కర్కాటక, సింహ, కన్య, మకర రాశుల వారు ఈ శని దోషం ఉన్నందువల్ల శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది.

ప్రతి మానవుడు, ప్రతి జీవి శని ప్రభావానికి లోనవ్వనివారు అంటూ ఎవ్వరూ ఉండరు. శనికి ఇష్టమైన రోజు శనివారం, అలాగే తిథి త్రయోదశి కలిసినందున శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. ఈ శని త్రయోదశినాడు శనికి ఇష్టమైన నువ్వులనూనె, నల్లని వస్త్రం, బెల్లం, నల్లనువ్వులు, నీలపు వర్ణం కలిగిన పువ్వులతో శనేశ్వరుని అర్చించినట్లైతే మృత్యుభయం తొలగిపోయి ఆరోగ్యం, ఆర్ధికం, ప్రశాంతత, అభివృద్ధిని ఇస్తాడు.
శనికి తైలాభిషేకం చేయండి
  శని త్రయోదశి సెప్టెంబరు 13, 27వ తేదీలు, వచ్చే జనవరి 24వ తేదీ నాడు వస్తుంది కావున ప్రతివారు శనికి తైలాభిషేకం చేయించిన చాలా మంచిది      


నవగ్రహాల్లో చంద్రునికి అతి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనస్సుకి చంద్రుడు కారకుడు అవటంవల్ల ఈ చంద్రుడికి శని ప్రభావం ఏర్పడినపుడు అనేక రూపాలలో మానసిక ఆందోళనకు గురయ్యే ఆస్కారం ఉంది. ఈ శని ప్రతి రాశిలోనూ రెండున్నర సంవత్సరాలు సంచరిస్తాడు. ఉదాహరణకు వర్తమానం శని సింహరాశిలో సంచరించటంవల్ల కర్కాటక, సింహ, కన్య రాశులను శని దోషం ఏర్పడినది. శని ఉన్న రాశికి వెనకరాశి ముందురాశికి ఏలినాటి శని దోషం అంటారు. చంద్రుడున్న రాశి నుంచి నాల్గవ స్థానంలో శని సంచారాన్ని అర్ధాష్టమ శని దోషం అని చంద్రుడున్న రాశి నుంచి ఎనిమిదవ స్థానం శని ఉన్నచో అష్టమ శని అని అంటారు.

అర్ధాష్టమ శని వర్తమానం వృషభ రాశికి నాల్గవ స్థానంలో శని సంచరించటంవల్ల ఈ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ఏర్పడినది. ఈ శని దోషం వల్ల ఏకాగ్రత లోపం, వాహన ప్రమాదాలు, పెద్దల గురించి ఆందోళన, చంచలత్వం అధికం కావటం, ఆరోగ్యంలో చికాకులు వంటివి ఏర్పడతాయి. ఏలినాటి శని దోషం అనగా శని సంచరిస్తున్న స్థానానికి వెనక భాగం అనగా పన్నెండవ స్థానం తాను ఉన్నస్థానం, రెండవ స్థానాన్ని ఏలినాటి శని దోషం అంటారు.

వర్తమానం సింహరాశిలో శని సంచారం జరుగుతున్నందువల్ల కర్కాటక రాశికి, సింహ రాశికి, కన్యా రాశికి ఏలినాటి శని దోషం జరుగుతోంది. కర్కాటక రాశికి ద్వితీయ స్థానం నందు అనగా కుటుంబస్థానం, ధన స్థానం నందు శని సంచారం వల్ల ఊహించని ఖర్చులు, కుటుంబీకులు మధ్య విభేదాలు, కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు, విద్యార్ధులకు ఏకాగ్రత లోపం వంటివి ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు.

సింహరాశి మీద శని సంచారం వల్ల సింహరాశి వారు ఆకారంలో కొంతమార్పు జుట్టు అధికంగా ఊడటం, శరీరం బలహీనపడటం, కళ్లు, తలకు సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి, కొంత తగ్గటం అందరికీ సహాయం చేసి మాటపడటం, ఆందోళన పడటం వంటివి ఎదుర్కొంటారు. కన్యా రాశి వారికి వ్యయం స్థానంలో శని సంచారం వల్ల నిద్రాభంగం, ఎముకలకి సంబంధించిన చికాకులు, మానసిక ఆందోళన, జ్ఞాపక శక్తి కొంత తగ్గటం, ఉన్నట్టుండి ఉద్రేక పడటం, వ్యాపారస్తులకు ఆందోళన కలగటం, నిలకడ లేకపోవటం వంటివి ఎదుర్కొంటారు.

తదుపరి అష్టమ శని... ఈ అష్టమ శని మకరరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల అష్టమ శని ఏర్పడినది. ఈ అష్టమ శని దోషం వల్ల మానసిక ఆందోళన పెరగటం, చిన్న చిన్న ప్రమాదాలు, తలపెట్టిన పనులు వాయిదా వేయటం, మాటపడటం, కుటంబీకుల మధ్య చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఈ దోషాలన్నింటికీ శని కారకుడు అయినందువల్ల శనివారం, త్రయోదశి కలిసినది శని త్రయోదశి. ఈ శని త్రయోదశి చాలా విశిష్టమైన రోజు. శనికి ఇష్టమైన రోజు ఈ శని త్రయోదశి. ఈ శని త్రయోదశి నాడు నువ్వుల నూనె, నలుపు వస్త్రం, నల్ల నువ్వులు, బెల్లం, నీలిరంగు వర్ణం కలిగిన పుష్పాలతో శనేశ్వరునికి అర్చించినట్లైతే ఈ శని దోషం తొలగిపోయి శుభం చేకూరుతుంది.

మానసిక అశాంతి తొలగిపోవటానికి, ఆరోగ్యం చేకూరటానికి, అన్నివిధాలా కలిసివచ్చేందుకు ఈ శనేశ్వరునికి తైలాభిషేకం చేయించినట్లైతే శుభం కలుగుగలదు.

శనీశ్వరుని యొక్క మహత్యం, చరిత్ర

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని మందపల్లి గ్రామం వద్ద కృతయుగంలో ఈశ్వరునికి, శనికి మధ్య సంవాదన జరిగినది. ఈశ్వరా! ఈ సాయంత్రం మిమ్మల్ని పట్టుకునేందుకు ఆజ్ఞ ఇవ్వండి అని శని కోరినాడు. ఈశ్వరుడు శని యొక్క శక్తిని పరీక్షించుటకు సరే అని తెలిపాడు. ఆ సాయంత్రం ఈశ్వరునికి శనికి దొరకకుండా ఉండేందుకు ఆలోచించి తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామం నందు రావిచెట్టు వద్ద ఈశ్వరుడు దాక్కున్నాడని, తపస్సు చేశాడని పురాణాలు చెప్తున్నాయి. మరునాడు ఉదయం ఈశ్వరుడు కళ్లు తెరిచేటప్పటికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించాడు. సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడు ఆహా! శని ప్రభావమునకు లోనయ్యాను.

సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి శని నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. ఈ రోజు శని త్రయోదశి కావున ఈ శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్చిస్తారో వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని తెలిపాడు. ఆ తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు.

శన్యారిష్టేతు సంప్రాప్తి శని పూజ్యాంచకారయేత్
శని ధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయేత ్.

నీలవర్ణం నీల పుష్పం మాల్యాంభరదరం నీలఛత్రం ధ్వజ రథ పతాకచక్రం
మేరుం ప్రదక్షిణ కుర్వాణం ప్రాధ్యముఖము అవంతిదేశాధిపతిం
పత్ని పుత్ర పరివార సమేత శనీశ్వీర గ్రహం అతిదేవతా ప్రత్యత దేవతా
సమేత శనీశ్వర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తిరుమలలో ముమ్మరంగా వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు

18-12-2024 బుధవారం దినఫలితాలు : కార్యసాధనకు ఓర్పు ప్రధానం...

Akhuratha Sankashti Chaturthi 2024: డిసెంబర్ 18న గణపతిని పూజిస్తే?

17-12-2024 మంగళవారం దినఫలితాలు : చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తథ్యం...

Show comments