Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషుల ముఖంపై పుట్టుమచ్చలు: ఫలితాలు

Webdunia
WD
ఎవరి ముఖమైనా చూడగానే మొదట నొసలు కనబడతాయి. ఈ నొసలు సువిశాలంగా ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడు అవుతాడు. అంతేకాదు కీర్తివంతుడవుతాడు. అటువంటి నుదుటి భాగాన మచ్చయున్న పురుషుడు పదిమందిలోనూ మంచివాడనిపించుకుంటాడు. పరోపకారి అవుతాడు. ధనధాన్యములకు లోటు ఉండదు.

ఈ పుట్టుమచ్చ సరిగ్గా రెండు కనుబొమలకు మధ్య ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్మంతుడవుతాడు. భోగము నందు ఆసక్తిని కలిగినవాడుగా ఉంటాడు. సువాసన ద్రవ్యముల పట్ల ఆసక్తిని కలిగి ఉండి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలవాడై వుంటాడు.

ఇక కుడి కనుబొమ మీద మచ్చయున్న వివాహము త్వరితగతిన అవుతుంది. సుగుణశీలయైన భార్య లభిస్తుంది. భార్య మూలంగా గొప్ప అదృష్టవంతుడవుతాడు. ఈ పురుషుడు శాంత స్వభావమును కలిగి ఉంటాడు. కుడి కంటిలోపల మచ్చ యుండినట్లయితే స్థిరాస్తులను కొనగల శక్తివంతుడవుతాడు.

కుడి కంటి రెప్పపై పుట్టుమచ్చ ఉన్నట్లయితే సంపదలను కలిగి ఉంటాడు. వాహన సౌఖ్యము లభిస్తుంది. మొత్తమ్మీద ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు కలిగిన పురుషులు అదృష్టవంతులుగా ఉంటారు. ఎడమవైపు పుట్టుమచ్చలు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తర్వాత కథనంలో తెలుసుకుందాం...
అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

అన్నీ చూడండి

లేటెస్ట్

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Show comments