Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయ సంస్కృతికి ప్రతీక ‘మధ్యప్రదేశ్‌’

WD
భారతీయ సంప్రదాయాన్ని ప్రస్ఫుటింపచేసే మధ్యప్రదేశ్‌ పర్యాటకులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఎన్నో చారిత్రాత్మక కట్టడాలను కలిగి ఉంది. వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

నర్మద-కావేరీ నదుల కలయిక వద్ద ‘ఓం’ ఆకారంలో ఉన్న ద్వీపంపై పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఓంకారేశ్వర దేవాలయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఇందులో ఓంకార-మాంధాతాతోపాటు సిద్ధనాధ దేవాలయం, ఇరవైనాలుగు అవతారాలతో ఉన్న జైన మందిరం భక్తులను పరవశింపచేస్తున్నాయి. దీనికి 7కి.మీ.దూరంలో కాజల్‌రాణీ గుహలవద్ద ప్రాకృతిక సౌందర్యం సందర్శకులను అలరిస్తున్నాయి.

ప్రాచీన భారతీయ సంస్కృతిక అద్దం పట్టేలా ఉన్న మహేశ్వర్‌ కోటలో హోల్‌కర్‌ వంశరాణి అహల్యాబాయి విగ్రహం గత చరిత్రను స్ఫురింపచేస్తుంది. నర్మద నది ఒడ్డుపై ఉన కాలేశ్వర్‌, విఠలేశ్వర్‌, అహిలేశ్వర్‌ దేవాలయాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. దీనికి దగ్గరలో ఉన్న ఇండోర్‌, ముంబాయి, ఢిల్లీ, భోపాల్‌ ప్రాంతాలకు విమాన సౌకర్యం కల్పిస్తూ ఎయిరప్ోర్ట్‌ రైలు మార్గం కూడా ఉంది. మాళవరాజుల సంప్రదాయానికి ప్రతీకంగా శతాబ్దంలో నిర్మింపబడిన ఓ కోటని కూడాచూడవచ్చు.

మధ్యప్రదేశ్‌ చూడదగిన ప్రదేశాలలో ప్రాశాస్త్యాన్ని పొంది 45కి.మీ.వరకు వ్యాపించి, 12తోరణద్వారాలను కలిగి, 2000అడుగుల ఎత్తు ఉన్న ఓ కోట ప్రాచీన భారతీయుల కళాచాతుర్యానికి అద్దంపడుతుంది.

బుందేల్‌ రాజ్‌పట్ వైభావాన్ని గుర్తు చేసే ఓర్‌భా, రాజప్‌ట్‌ల శౌర్య ప్రతాపాలకు కేంద్రమైన గ్యాలియర్‌ లాంటివి మధ్యప్రదేశ్‌లోని ఐతిహాసిక సందర్శన స్థలాలలో ముఖ్యమైనవి. రెండుమైళ్ళ పొడవు 35అడుగుల ఎత్తుతో ఉన్న అద్భుతమైన కోటతో పాటు, మాన్‌దేవాలయం, ఆదికాలంనాటి సూరజ్‌కుండ్‌ పేరుతో ఉన్న సరస్సు, పదకొండో శతాబ్దంనాటి విష్ణుమందిరం లాంటి ఎన్నో చరిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్‌ వన్యప్రాణుల సంరక్షణకు కూడా పేరుగాంచింది. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు సందర్శకుల పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. భీమ్‌బేటకాలో అతి ప్రాచీన గుహలతో ఆదిమానవుల జీవిత విధానాన్ని తెలిపే చిత్రాలు దాదాపు 500లకుపైగా గోడలపైన చిత్రించారు. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 28కి.మీ.దూరంలో భోజరాజు పదకొండవ శతాబ్దంలో భోజాపూర్‌ను ఏర్పరిచారు. భోజేశ్వర్‌ దేవాలయంలోని గర్భగుడిలో ఉన్న శివలింగం 7.5అడుగుల ఎత్తుతో 21.5అడుగుల వెడల్పుతో ఉంది. ఇలా మధ్యప్రదేశ్‌ భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

Show comments