Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధురానుభూతి మిగిల్చే మైసూర్‌

WD
కర్నాటకలో బెంగుళూరు తరువాత ముఖ్యమైనది మైసూరు. ఇది రాజప్రసాదాలకి, మహారాజుల కోటలకి, దేవాలయాలకి, నిలయమంటే అతిశయోక్తి లేదు. మైసూరు ఢిల్లీకి 2832 కి.మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుంచి మైసూర్‌కి 3 గంటల ప్రయాణం.

గంధపు చెక్కలకి, పట్టు చీరలకి మైసూర్‌ విశ్వవిఖ్యాతిగాంచింది. మైసూర్‌లో ఉన్న బృందావన్‌ గార్డెన్‌‌స ఆ నగరానికే వన్నె తెచ్చింది. ఇక్కడి రాజకోటలు, తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అక్టోబర్‌ ఈ నగరాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు సందర్శకులను మరింత అలరిస్తాయి.

1912 లో నిర్మించిన రాజమహల్‌ వాస్తుకళ నిజంగా ప్రశంసనీయం. ప్రస్తుతం మైసూర్‌ పాలెస్‌ని ఓ అద్భుతమైన మూ్యజియంగా మార్చారు. దీనిలో అమూల్యమైన విగ్రహాలు, చిత్రలు ఉన్నాయి. దీనిలోని దర్బార్‌హాల్లో 400 సం క్రితం తెచ్చిన 280 కి.గ్రాల వెండి సింహాసనం, హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ల ఆయుధాలు కూడా దీనిలో ఉన్నాయి.

దీనితోపాటు జగన్‌మోహన్‌ ఆర్‌‌ట గాలరీ ఉంది. దీనిలో అత్యంత అద్భుతమైన చిత్రాలు, 15 అడుగుల అద్దం వుంది. ఈ రాజమహలులో 200 గదులు ఉన్నాయి. దర్బారు హాలుని సుమారు ఐదువేల మంది ఒకేసారి సందర్శించవచ్చు. ఈ రాజమహల్‌లో బంగారు సింహాసనం ఉంది. మూడు అంతస్తుల ఈ రాజమహల్‌ ఐదు కి.మీ.వరకు వ్యాపించి వుంది. సిటీబస్‌స్టాప్‌కి 23 కి.మీ.దూరంలో ఉన్న శృంగపటన్‌లో 19 అడుగుల ఎత్తు ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఉంది.

మైసూర్‌లో చూడదగిన దేవాలయాలలో చాముండీ మందిరం ఒకటి. దీని సింహద్వారం పొడవు 15 అడుగులు. అమ్మవారి విగ్రహం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఐదడుగుల పొడవు వుంటుంది. మంగళవారం, శుక్రవారం జరిగే ప్రతే్యక పూజలకి 30 లక్షల భక్తులు వస్తారు.

కృష్ణవాడియర్‌ రాజు గుర్తుగా నిర్మించిన బృందావన్‌ గార్డెన్స్ సాయంత్రం 5 గం నుంచి రాత్రి 9 గం వరకు పర్యాటకులతో ఉన్న బృందావన్‌ గార్డెన్‌ ఎదురుగుండా కావేరీ దేవాలయం వుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి మైసూర్‌ మరపురాని మధురానుభూతులని అందిస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments