Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసు తెచ్చిన తంటా : చైనాపై ఐఓసీ కన్ను

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2008 (13:15 IST)
బీజింగ్ ఒలింపిక్‌లో పతకాల పట్టికలోని అగ్రస్థానంపై దృష్టి పెట్టిన చైనాపై ప్రస్తుతం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కన్ను పడింది. పతకాల సాధన లక్ష్యంతో చైనా నిబంధనలను తుంగలో తొక్కిందన్న ఆరోపణల మధ్య ఐఓసీ చైనాపై విచారణకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా జిమ్నస్టిక్స్‌లో చైనా తరపున పతకాలు సాధించిన వారిలో వయసు తక్కువ వారెవరైనా ఉన్నార అన్న విషయాన్ని ఆరా తీయాల్సిందిగా జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్‌ను ఐఓసీ కోరింది. చైనాకు చెందిన హే కెక్సిన్ అనే చిన్నారి బీజింగ్ ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ పోటీల్లో ఓ గ్రూపు స్వర్ణాన్ని, వ్యక్తిగత స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

అయితే రెండు స్వర్ణాలు సాధించిన ఈ చిన్నారి వయసు ఒలింపిక్ నిబంధనల ప్రకారం లేదనే విమర్శలు వినవచ్చాయి. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం జిమ్నస్టిక్స్‌లో పాల్గొనే వారి వయసు 16ఏళ్లు పూర్తయ్యి ఉండాలి. దీని ప్రకారం చైనా సమర్పించిన పత్రాల్లో హే కెక్సిన్ పుట్టిన తేదీని జనవరి 1 1992గా పేర్కొంది.

అయితే హే కెక్సిన్ వయసు ఇంకా 16ఏళ్లు పూర్తి కాలేదని పతకాల కోసం చైనా చిన్నారులను పోటీలకు పంపింది అనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ విషయం గురించి విచారించాల్సిందిగా అంతర్జాతీయ జిమ్నస్టిక్ ఫెడరేషన్‌ను ఐఓసీ కోరింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

Show comments