Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెరుగ్గా రాణించకపోతే నగదులో కోత : బ్రిటన్

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2008 (13:45 IST)
బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో తమ క్రీడాకారులు మెరుగ్గా రాణించికపోతే వారికి ఇచ్చే నగదు మొత్తంలో కోత విధిస్తామని బ్రిటన్ హెచ్చరించింది. చైనా విశ్వ క్రీడల్లో రాణించడమే కాకుండా పతాకాలు గెలుచుకురావాలని తమ క్రీడాకారులకు బ్రిటన్ సూచించింది. తమ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో 41 పతాకాలు గెలవాలని బ్రిటన్ క్రీడల శాఖ మంత్రి జెర్రీ సట్‌క్లిఫ్ చెప్పారు.

బ్రిటన్ అథ్లెట్లు తాము సూచించిన విధంగా రాణించకపోతే నగదులో కోత ఉంటుందని సట్‌క్లిఫ్ హెచ్చరించారు. బ్రిటన్ క్రీడాకారులు మెరుగ్గా రాణించి తమ దేశ ఔన్నత్యాన్ని చాటాలన్నారు. విశ్వ క్రీడల్లో తమ క్రీడాకారుల శిక్షణ, ఇతర అవసరాల కోసం 500 మిలియన్ పౌండ్లు ఖర్చుపెట్టామని తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో వ్యయం చేసినపుడు దానికి తగిన రాబడిని ఆశించటంలో తప్పులేదని సట్‌క్లిఫ్ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నన్ను వేశ్యగా మారుస్తానన్నాడు, అందుకే చంపేసా: భర్త హత్యపై భార్య

గూగుల్ మ్యాప్‌పై గుడ్డి నమ్మకం- ఇటలీలో ఎగురుతూ కిందపడిన బీఎండబ్ల్యూ కారు (video)

జగన్‌తో విబేధాలు అక్కడ నుంచే మొదలు.. రఘు రామ కృష్ణంరాజు

తిరుమలలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నికి ఆహుతి అయిన కారు (video)

తండ్రి చనిపోయినా తల్లి చదివిస్తోంది.. చిన్నారి కంటతడి.. హరీష్ రావు భావోద్వేగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

Show comments