Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్ వేడుకలు డీడీలో ప్రత్యక్ష ప్రసారం

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2008 (16:01 IST)
చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ విశ్వ క్రీడల ప్రారంభోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారాన్ని దూరదర్శన్ (డీడీ) చేస్తుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 17.30 ని. ల నుంచి రాత్రి 21.05 ని.ల వరకూ జరుగుతుంది. ప్రారంభోత్సవ వేడుకలు దూరదర్శన్ నేషనల్ ఛానెల్ (డీడీ-1) తో పాటుగా డీడీ స్పోర్ట్స్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

బీజింగ్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారం ఆగస్టు 24వ తేదీన ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 17.30 ని.ల నుంచి రాత్రి 19.30 ని.ల వరకూ జరుగుతుంది. దేశంలోని క్రీడాభిమానుల కోసం దూరదర్శన్ ఈ యత్నాలు చేపట్టింది.

బీజింగ్ ఒలింపిక్స్‌లో కొన్ని పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటుగా మరికొన్నింటిని తర్వాత ప్రసారం చేయటానికి డీడీ చర్యలు తీసుకుంది. ఈ ప్రసారాలు నిరంతరాయంగా జరుగుతాయి. బీజింగ్ ఒలింపిక్స్‌లో పాల్గొనటానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది క్రీడాకారులు అక్కడకు వచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

ఇంటర్ విద్యలో సంస్కరణలు చేద్దామా లేదా? సూచనలు కోరిన ప్రభుత్వం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామలక్ష్మణులు కల్పిత పాత్రలు - బహిరంగ క్షమాపణలు చెప్పిన శ్రీముఖి (Video)

'గేమ్ ఛేంజర్' బెనిఫిట్ షోకు తెలంగాణ సర్కారు అనుమతి నిరాకరణ!!

రామలక్ష్మణులు ఫిక్షనల్ క్యారెక్టర్సా? మరి నువ్వేంటి?: సారీ చెప్పిన శ్రీముఖి (Video)

ట్రోలింగ్‌కు దారితీసిన అనంత శ్రీరామ్ ప్రసంగం!!

తాతయ్య బాలయ్యకు ఇంకా ఇలాంటి సీన్లు, డ్యాన్సులు అవసరమా?