Webdunia - Bharat's app for daily news and videos

Install App

డోప్ టెస్టులో దొరికిన మోనికా : భారత్‌కు షాక్

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2008 (13:18 IST)
బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు తరపున వెయిట్‌లిఫ్టింగ్‌లో బరిలోకి దిగాల్సిన మోనికా దేవి డోప్ టెస్టులో పట్టుబడింది. దీనితో భారత ఒలింపిక్ బృందానికి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. విశ్వ క్రీడల్లో భాగంగా న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన డోప్ టెస్టుల్లో మోనికా దేవి దొరికిపోయింది. మోనికా నిష్క్రమణతో పూజారి శైలజ చివరి నిమిషంలో బీజింగ్‌కు బయలుదేరనుంది.

మోనికా దేవికి గతంలో జూన్ 29వ తేదీన డోప్ పరీక్షను నిర్వహించగా అందులో గట్టెక్కింది. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి మోనికా దేవి. భారత వెయిట్‌లిఫ్టింగ్ జట్టులో 69 కిలోల విభాగంలో మోనికా దేవి తలపడాల్సి ఉంది.

జపాన్ వేదికగా ఈ ఏడాది జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో మోనికా ఒక రజతం, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది. దీనితో బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆమెకు బెర్తు ఖాయమైంది. ఇండియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన శైలజా పూజారిని అధిగమించి మోనికా దేవి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

Show comments