Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకలకు సోనియా

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2008 (13:46 IST)
చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్ క్రీడలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వెళుతున్నారు. క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు తిలకించటానికి సోనియా గాంధీ పయనమవుతున్నారు. సోనియాతో ఆమె తనయుడు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ కూడా బయలుదేరుతున్నారు.

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఆహ్వానం మేరకు సోనియా గాంధీ వెళుతున్నారని ఏఐసీసీ ప్రతినిధి వీరప్ప మెయిలీ చెప్పారు. బీజింగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి బుధవారం రాత్రి బయలుదేరుతారని వివరించారు. ఆమె వెంట రాహుల్, ప్రియాంకా వాద్రా కుటుంబం వెళుతుందని తెలిపారు.

చైనా ప్రభుత్వ అతిథి హోదాలో బీజింగ్‌కు సోనియా గాంధీ వెళుతున్నారని వివరించారు. బీజింగ్ ఒలింపిక్ ప్రారంభోత్సవ వేడుకలు జరిగే బర్డ్ నెస్ట్ స్టేడియంలో వీవీఐపీ ఎన్‌క్లోజర్‌లో కాకుండా సెలబ్రిటీల విభాగంలో సోనియా కూర్చుని తిలకిస్తారని మెయిలీ వెల్లడించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

Kodali Nani : అసోంలో కొడాలి నాని కీలక సహచరుడు కాళి అరెస్ట్

Chandrababu: పింఛన్ లబ్ధిదారుడి ఇంట కాఫీ తాగిన చంద్రబాబు (video)

ఏడుకొండలు ఇంటిలో కాఫీ తయారు చేసిన సీఎం చంద్రబాబు (Video)

తెలుగుతల్లికి జలహారతి.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే.. చంద్రబాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: మన కోసం ప్రేమించే, జీవించే వ్యక్తులున్నప్పుడు.. డ్రగ్స్ అవసరమా? డార్లింగ్స్?

Keerthy Suresh: సమంతకు థ్యాంక్స్ చెప్పిన కీర్తి సురేష్.. ఎందుకో తెలుసా?

పవన్ అంటే పెద్దరికం... పక్షపాతం లేకుండా స్పందించారు : సినీ నటి కస్తూరి

Akira: సాదాసీదాగా కాశీలో అకీరా, ఆద్య.. బాగా పెంచారని రేణు దేశాయ్‌కి కితాబు (video)

అభిమానులకూ, తల్లిదండ్రులకు పాఠాలు నేర్పిన 2024 సినిమా రంగం- స్పెషల్ స్టోరీ

Show comments