Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్‌లో ట్వంటీ20కు స్థానం : గిల్‌క్రిస్ట్

Webdunia
సోమవారం, 4 ఆగస్టు 2008 (17:22 IST)
విశ్వ క్రీడలైన 2020 ఒలింపిక్స్‌లో బహుళ ప్రజాదరణ పొందుతున్న ట్వంటీ20 క్రికెట్‌కు స్థానం కల్పించాలని ఆస్ట్రేలియా మాజీ కీపర్, ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ కోరారు. తద్వారా క్రికెట్‌కు కొత్త అందం సంతరించుకుంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో ట్వంటీ20 మ్యాచ్‌లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందని వివరించారు.

ఆస్ట్రేలియా మెరుపు ఓపెనర్ ఆడం గిల్‌క్రిస్ట్ బీసీసీఐ నేతృత్వంలో ఆర్భాటంగా ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీల్లో హైదరాబాద్ డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదు.

ఒలింపిక్స్‌లో భాగంగా 1900 సంవత్సరంలో జరిగిన పోటీల్లో క్రికెట్‌కు స్థానం కల్పించటం జరిగిందని గుర్తుచేశారు. ఆ తదుపరి కాలంలో క్రికెట్‌ను ఈ పోటీల నుంచి తొలగించారని వివరించారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే శతాబ్ద కాలంలో క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కృషి జరపాలని గిల్‌క్రిస్ట్ పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

పాకిస్థాన్ నటుడు నటించిన "అబీర్ గులాల్‌"పై కేంద్రం నిషేధం!

Rowdy Wear : రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం డిమాండ్ ఉంది : విజయ్ దేవరకొండ

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

Show comments