సామాజిక చిత్రాలకు ఒరవడి దిద్దిన చోప్రా

Webdunia
గురువారం, 6 నవంబరు 2008 (13:29 IST)
బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యంత ప్రతిభావంతులై నిర్మాత-దర్శకులలో ఒకరైన బిఆర్ చోప్రా చిత్రాలలో ప్యాపారపరమైన విజయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది గాని భారతీయ సినిమ ప్రతిష్టను డబ్బు, స్టార్‌డమ్ అనేవి మసకబారుస్తున్నాయని ఎల్లప్పుడూ భావించేవారు. హిందీ సినిమారంగంలో దిగ్గజంలా కీర్తి గాంచిన బిఆర్ చోప్రా 94 ఏళ్ల ప్రాయంలో బుధవారం ముంబైలో కన్నుమూశారు.

సినిమా మాధ్యమం డబ్బు సంపాదించే వాహకం మాత్రమే కాదని బిఆర్ చోప్రా చెప్పేవారు. ఏదైనా సినిమా అనేది సమాజాన్ని ప్రతిబింబించాలని, ఆరోగ్యదాయకమైన, సమగ్ర చిత్రాలను నిర్మించాల్సిన బాధ్యత చిత్ర నిర్మాతలపైనే ఉందని ఆయన చెప్పేవారు. సినిమాకు చక్కటి కథ, సామాజిక దృష్టి చాలా అవసరమని ఆయన చెబుతూ వచ్చారు.

తానేం చెబుతూ వచ్చారో దాన్ని స్వయంగా చోప్రా ఆచరించి చూపారు. అశ్లీల చిత్రం గుమ్రాహ్, అత్యాచార రాజకీయాలపై తీసిన చిత్రం ఇన్సాఫ్ కా తరాజు, ముస్లిం వివాహ చట్టాలపై తీసిన నిక్కా, వ్యభిచారిణుల పునరావాసంపై తీసిన సాధన, విధవా వివాహంపై తీసిన ఎక్ హీ రాస్తా.. ఇలా తను తీసిన అన్ని సినిమాలలోనూ ఫార్ములాకు విరుద్ధమైన స్పష్టమైన, వాడి, వేడి కలిగిన కథను చోప్రా ఎంచుకునేవారు. తన సినీరంగ కెరీర్‌ను రచయితగా ప్రారంభించిన బలదేవ్ రాజ్ చోప్రా, సినిమాలలో కథకు అందుకే అంత ప్రాధాన్యత ఇచ్చేవారు.

ఇంగ్లీషు లిటరేచర్‌లో ఎంఎ చదివిన చోప్రా దేశ విభజన సమయం వరకు సినీ హెరాల్డ్ పత్రికలో సినీ జర్నలిస్టుగా పని చేయడం కొనసాగించారు. స్వాతంత్ర్యానంతరం ముంబై వచ్చిన చోప్రా 1951లో తీసిన అఫ్సానా చిత్రంతో దర్శకత్వ రంగంలో అడుగు పెట్టారు. ఇద్దరు కవలసోదరుల లోని మంచి చెడు గుణాలను చిత్రించిన ఈ సనిమాలో అశోక్ కుమార్ ద్విపాత్రాభినయం చేశారు. తొలి చిత్రమే విజయం సాధించటంతో పాటు విమర్శకులు ప్రశంసలందుకోవడం విశేషం.

లాహోర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సినీ వ్యాపారంలో అడుగు పెట్టిన చోప్రాకు చిత్ర నిర్మాణం గురించి ఓనమాలు తెలియవు. చివరకు నటీనటులను ఎలా కలుసుకోవాలో కూడా ఆయనకు తెలిసేది కాదు. అఫ్సానా చిత్రానికి గాను అశోక్ కుమార్‌ను సంప్రదించాలని తలిచిన చోప్రా బాంబేటాకీస్ ఛైర్మన్ జెపి తివారీ సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర అందరికీ తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibernet Case: చంద్రబాబుపై దాఖలైన ఫైబర్‌నెట్ కేసు.. కొట్టివేసిన వైజాగ్ ఏసీబీ కోర్టు

సార్, ఇక్కడ పవర్ కట్, నెట్ లేదు: WFH ఉద్యోగి నాటకాలు, పీకేయండంటూ కామెంట్స్

పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు బ్రేక్.. సంబరాలు చేసుకుంటున్న వైకాపా

రెడ్ బుక్ పేరెత్తితే కొడాలి నాని వెన్నులో వణుకు : మంత్రి వాసంశెట్టి

తరగతిలో పాఠాలు వింటూ గుండెపోటుతో కుప్పకూలిన పదో తరగతి విద్యార్థిని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

Show comments