Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దేవదాసు"కు 56 ఏళ్లు..!

Webdunia
WD
అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి నటించిన అలనాటి చిత్రం దేవదాసు. ఈ చిత్రం 26.6.1953లో విడుదలైంది. సరిగ్గా నేటికి 56 వసంతాలు పూర్తయ్యాయి.

తెలుగులో అక్కినేని నటించిన దేవదాసు రిలీజ్‌నాడే పోటీగా సైగల్ నటించిన హిందీ దేవదాసు విడుదలైంది. ఆ ప్రభావం తెలుగుపై పడకపోవడంతో మరింత విజయం సాధించింది.

1951 నవంబర్ 24న మద్రాసులోని రేవతి స్టూడియోలో రాత్రి 8 గంటలకు దేవదాసు షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని నిర్మించేందుకు విజయవాడకు చెందిన ద్రణావధ్యుల లక్ష్మీనారాయణ ముందుకొచ్చారు.

అనంతరం ముగ్గురు భాగస్తులు కూడా కలిశారు. కానీ ప్రారంభానికి ముందే దేవదాసు సినిమా తీస్తే నువ్వుకూడా దేవదాసు అయిపోతావ్, నష్టపోతావ్ అని లక్ష్మీనారాయణను మిగిలిన ఇద్దరు భాగస్తులు భయపెట్టారు.

చివరికి భాగస్తులకు వారి వారి వాటాలిచ్చి దేవదాసు చిత్రం నిర్మాణం నుంచి తప్పించారు. మొండి ధైర్యంతో ద్రణావధ్యుల లక్ష్మీనారాయణ ఒక్కరే ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు వేదాంతం రాఘవయ్య ఆయనకు ధైర్యాన్ని నూరిపోశారు. అలా మొదలై కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని విడుదల తర్వాత దేవదాసు చిత్రం సక్సెస్ అయింది.

ఇంకా ఈ చిత్రానికి సీనియర్ సముద్రాల మాటలు, పాటలు హైలైట్‌గా నిలిచాయి. 11 పాటలుండటమే ఈ సినిమా గొప్ప. ఈ మఝ్య సినిమాల్లో వైవిధ్యమంటుంటారు. కానీ అసలు వైవిధ్యం ఈ చిత్రంలోని ఒక్కోపాట. "పల్లెకుపోదాం.. పారును చూద్దాం చలోచలో..", "అంతా భ్రాంతియేనా జీవితాన వెలిగింతేనా...", "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్...", "జగమే మాయ బ్రతుకే మాయ.." ఇలా వేటికవే ప్రత్యేకతే.

కానీ జగమేమాయ పాట రికార్డింగునాటికి బాణీలు కట్టిన సుబ్బరామన్ చనిపోయారు. అందువల్ల ఆయన శిష్యుడు ఎం.ఎస్. విశ్వనాథన్ దాన్ని రికార్డింగ్ చేశారుయ పాట రికార్డింగ్ చేసే సమయంలో విశ్వనాథన్ నిజంగానే ఏడ్చేశారు.

శరత్ సృష్టించిన గొప్ప పాత్ర నాగేశ్వరరావు చెయ్యడమా? పైగా సావిత్రి పార్వతి పాత్రా? రాఘవయ్య దర్శకుడా? శరత్ నవలలు ఎవరికీ అర్థంకావు. వాటిని సినిమాగా తీయడమేమిటని అలనాడే మేథావులు విమర్శలు ముందుంచారు. అందుకే ఇప్పటికే నాగేశ్వర రావు ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. పట్టుదల, మొండితనం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయన్నారు. అందుకే దేవదాసు ఘన విజయం సాధించిందంటున్నారాయన.

ఒక పార్వతి పాత్రకు మొదట షావుకారు జానకిని ఎంపిక చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో "శాంతి" చిత్రంలో చిన్న పాత్రవేసిన సావిత్రిని ఎంపిక చేశారు.

ఈ చిత్రం గురించి అంతర్జాతీయ చలనచిత్ర రంగంలో చర్చ జరిగింది. "ది హాలీవుడ్ రీసెర్చ్ సెంటర్" దేవదాసును పరిశోధించి తనతంటూ చరిత్ర సృష్టించిన పాత్రలలో మొదటిస్థానం "సిండ్రెల్లా"ది. రెండో స్థానం "జేమ్స్‌బాండ్"ది అయితే, మూడోది దేవదాసు పాత్రదని స్పష్టం చేసింది.

ఇకపోతే.. దేవదాసు చిత్రం 14 సెంటర్లలో రిలీజ్ అయి 7 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని బెంగాలీలో పి.సి. భారువా తీశారు. తర్వాత హిందీలో కె. ఎల్. సైగల్‌తో తీశారు. ఆ తర్వాత తెలుగులో అక్కినేనితో తెరకెక్కింది. మళ్లీ దిలీప్‌కుమార్‌తో హిందీలో నిర్మాణమైంది. కృప్నతో విజయనిర్మల నిర్మించారు. తదనంతరం షారూఖ్ ఖానుతో మళ్లీ హిందీలో నిర్మించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments