Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాత పాట 'మధురం'..

Webdunia
FILE
అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం!

పడమట సంధ్యారాగం,
కుడి ఎడమల కుసుమపరాగం

ఒడిలో చెలి మోహన రాగం...
జీవితమే మధురానురాగం

పడిలేచే కడలి తరంగం,
వడిలో జడిసిన సారంగం

సుడిగాలిలో ఎగిరే పతంగం
జీవితమే ఒక నాటకరంగం!

చల్లని సాగర తీరం, మదిజిల్లను మలయ సమీరం
మదిలో కదిలే సరాగం, జీవితమే అనురాయ యోగం!!

ఈ పాట.. 1953లో తీసిన "బ్రతుకు తెరువు" అనే చిత్రంలోని ఈ పాట. అక్కినేని నాగేశ్వరరావు, అలనాటి నటి సావిత్రి నటించిన ఈ సినిమాలో 'అందమె ఆనందం' అనే పాట తెలుగు సీమను చాలాకాలం పాటు ఉర్రూతలూగించింది. అప్పట్లో కుర్రాళ్లు, పెద్దాళ్లు తరచుగా ఈ పాటనే పాడుకోవడం ఫ్యాషన్‌గా వుండేది. తెరువు అంటే తమిళంలో వీధి, సందు అనే అర్థాలున్నాయి.

మరో పదంతోను జతచేసి తెలుగువాళ్లు తెరువును ఉపయోగించరు, బతుకుతో తప్ప. ప్రపంచంలో చాలా వైరుధ్యాలు ఉన్నట్లే రాజీపడే మనుషులు, రాజీపడని మనుషులు అని మరో రెండు రకాల వాళ్లు వుంటారు. మనుషుల్లో రాజీ ధోరణి, నిజాలు దాచేసి అబద్ధాలతో జీవితం గడిపేసే వారి మనస్తత్వాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమే - "బతుకు తెరువు".

ఈ చిత్రం తెలుగులో వచ్చాక హిందీలో "జీనేకి రాహ్‌" అనే పేరుతో ఇదే కథతో సినిమా తీశారు. అది చూసి మళ్లీ తెలుగులో "భార్యాబిడ్డలు" అనే తెలుగు చిత్రం ఇంకోటి వచ్చింది.

బతుకు తెరువు సినిమా వచ్చింది, నాకు బతుకు తెరువు నిచ్చింది అంటూ ఈ గీత రచయిత సముద్రాల జూనియర్‌ చెప్పుకునే వారట. ఆయన అసలు పేరు సముద్రాల రామానుజాచార్యులు. సముద్రాల సీనియర్‌ కుమారుడే ఈ జూనియర్‌ సముద్రాల. ఆయన రాసిన మొట్టమొదటి పాటే పాపులర్‌ అయింది.

ఈ పాటలో మరో విశేషం వుంది. ఇందులో ఇద్దరు ఇంగ్లీష్‌ కవుల ప్రఖ్యాతమైన కొటేషన్లు కనిపిస్తాయి. ఇంగ్లీష్‌ కవి కీట్స్‌ రాసిన పొయెట్రీలో ఒక వాక్యం. 'ఎ థింగ్‌ ఆఫ్‌ బ్యూటీ ఈజ్‌ ఎ జాయ్‌ ఫర్‌ ఎవర్‌' అనే మాటకు యథాతథంగా కాపీలా వుంటుందీ.. 'అందమె ఆనందం'. ఇదే పాటలో మరో చోట జీవితమే ఒక నాటక రంగం - అనే వాక్యం వుంది. అది షేక్స్‌పియర్‌ వాడిన మాట... 'ఆల్‌ ద వరల్డ్‌ ఈజ్‌ ఎ స్టేజ్‌' అనే మాటను గుర్తు చేస్తుంది.

బతుకు తెరువు సినిమాకి సంగీత దర్శకుడు జె.వి.రాఘవులు అయినా అందమె ఆనందం పాటకి ట్యూన్‌ ఇచ్చింది మాత్రం ఘంటసాల గారే అంటారు. ఆయన గళంలో ఈ పాట మధురాతి మధురంగా పలికింది. పి.లీల శ్రుతి కలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

Show comments