సునిధికి దక్షిణాఫ్రికాలో చేదు అనుభవం

Webdunia
ప్రముఖ బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్‌కు దక్షిణాఫ్రికాలో ఓ చేదు అనుభవం ఎదురయ్యింది. సునిధి ధరించే ఆభరణాలను జప్తు చేసేందుకు డర్బన్ హైకోర్టు అనుమతి ఇవ్వటంతో రెండు రోజులపాటు ప్రదర్శన ఇచ్చేందుకు అక్కడికి వెళ్లిన ఆమెకు గొంతులో పచ్చివెలగకాయ పడినట్లయ్యింది.

మొదటి షో ఇచ్చేందుకు సునిధి సిద్ధమవుతున్న తరుణంలో ఆమె నుంచి తనకు రావాల్సిన 5,300 డాలర్ల మొత్తాన్ని ఇప్పించాలంటూ.. స్థానిక వ్యాపారవేత్త సునీల్ సింగ్ హైకోర్టును ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో చేసేదిలేక సునిధి మూగనోము పట్టాల్సి వచ్చింది.

వివరాల్లోకి వస్తే... డర్బన్‌లో ఓ సంగీత ప్రదర్శన ఇచ్చేందుకుగానూ 8 సంవత్సరాల క్రితం సునిధి చౌహాన్‌కు సునీల్ సింగ్ పై మొత్తాన్ని ఇచ్చారు. 2001 జూన్‌లో ఆమెకు డబ్బు ఇచ్చినట్లుగా ఆయన చెబుతున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్‌‌లో అమెరికాపై దాడులు జరగటంతో సునిధి ప్రదర్శన వాయిదా పడింది.

తనవద్ద తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వకుండా, మరుసటి ఏడాదే సునిధి మరో ప్రమోటర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంది. 2003, 2004 సంవత్సరాలలో ప్రోగ్రామ్ ఇవ్వాలని ఆమెని కోరినప్పటికీ... అంగీకరించలేదని సింగ్ పేర్కొన్నారు. దీంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, హైకోర్టు సింగ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సౌదీ అరేబియాను ముంచెత్తుతున్న వర్షాలు, రెడ్ అలెర్ట్

జగన్ మతంలో జరిగివుంటే ఇలాగే స్పందించేవారా? పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ నాయకత్వమే కారణం : అమిత్ షా

ప్రేమ వ్యవహారం : క్రికెట్ బ్యాటుతో కొట్టి విద్యార్థిని చంపేశారు...

దారుణం, బాలికపై లైంగిక దాడి చేసి ప్రైవేట్ పార్టులో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

Show comments