Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిడ్నీలో ఎన్నారై మహిళ కిడ్నాప్

Webdunia
FILE
కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ఓ ఆస్ట్రేలియన్‌ను వివాహం చేసుకున్నందుకుగానూ.. ఒక భారత సంతతి మహిళ సిడ్నీలో కిడ్నాప్‌కు గురయ్యింది. సిడ్నీలోని స్టార్త్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక రేడియో ఛానెల్ ఒక కథనాన్ని వెల్లడించింది.

ఈ కిడ్నాప్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన యువతి భర్త చేతి వేళ్లను కొరికి ఇద్దరు దుండగులు ఆమెను అపహరించుకు పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆ యువతి భర్త తలకు కూడా గాయమయ్యిందనీ, చికిత్స నిమిత్తం అతడిని రాయల్ ప్రిన్స్ ఆల్‌ఫ్రెడ్ ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా.. దుండగుల బారి నుంచి బాధితురాలిని విడిపించామనీ, ఆ కిడ్నాపర్లలో ఒకరు ఆ యువతి సోదరుడేనని పోలీసులు వివరించారు. అయితే కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న కారణంతోనే వారు ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని, నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments