Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోర్బ్స్ జాబితాలో ఇంద్రానూయి, సోనియా..!!

Webdunia
FILE
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో పెప్సికో సీఈఓ, ప్రవాస భారతీయురాలు అయిన ఇంద్రానూయి ఈసారి కూడా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అత్యంత ప్రజాదరణ, సామర్థ్యంతో కూడిన మహిళలతో ఈ జాబితాను రూపొందించినట్లు ఫోర్బ్స్ ఈ సందర్భంగా ప్రకటించింది.

ప్రపంచంలోని శక్తివంతమైన వంద మంది మహిళలతో కూడిన జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించింది. ఇదే జాబితాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియాగాంధీ 13వ స్థానంలో నిలవగా... ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ మరియు ఎండీ చందా కొచార్ తొలిసారిగా 20 స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే, 99వ స్థానంలో ఉన్న బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా 91వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

గత ఏడాదితో పోల్చితే సోనియాగాంధీ తన ర్యాంకును మరింతగా మెరుగుపరచుకుని 21వ స్థానం నుంచి ఏకంగా 13వ స్థానానికి చేరుకున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీకి సారథ్యం వహిస్తూ విజయవంతమైన నాయకురాలిగా రాణిస్తోన్న సోనియాకు 13వ స్థానాన్ని ఇవ్వటం సమంజసమని ఫోర్బ్స్ ఈ సందర్భంగా ప్రకటించింది.

ఇక చందా కొచార్.. దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకు అయిన ఐసీఐసీఐకి తొలి మహిళా బాస్‌గా విధులు నిర్వర్తిస్తూ, బ్యాంకును విజయపథాన నడిపిస్తున్నారని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది. కాగా.. ఈ జాబితాలో మొదటి స్థానాన్ని జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ దక్కించుకోగా.. రెండో స్థానంలో ఫెడరల్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ కార్ఫ్ ఛైర్మన్ షెల్లా బ్లెయిర్ సాధించుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments