Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫార్చ్యూన్-500 జాబితాలో ఇంద్రానూయీ

Webdunia
ప్రపంచవ్యాప్తంగా ఉండే అత్యంత ప్రముఖమైన కంపెనీల జాబితా అయిన ఫార్చ్యూన్-500లలో భారతీయ సంతతి మహిళా వ్యాపారవేత్త, పెప్సికో అధినేత్రి స్థానం సంపాదించారు. టాప్ 15 మంది మహిళా సీఈఓలలో ఒకరిగా చోటు దక్కించుకున్న ఈమె... గత సంవత్సరం కూడా ఈ విభాగంలో నిలిచారు.

కాగా... ఈ ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో పెప్సికోకు ఈదఫా 175వ స్థానం లభించింది. గత సంవత్సరం పార్చ్యూన్-500 కంపెనీలలోని మహిళా సీఈఓల సంఖ్య ఈసారి 15కు పెరిగిన విషయం గమనార్హం. ఇదిలా ఉంటే... మహిళలు సీఈఓలుగా ఉన్న కంపెనీలలో అగ్రికల్చర్ ప్రాసెసింగ్ కంపెనీ ఆర్చర్ డేనియల్ మిడ్‌లాండ్ ప్రథమ స్థానంలో నిలిచారు.

2006 వ సంవత్సరం నుంచి పెప్సికో సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంద్రా నూయి, 13.4 మిలయన్ల వృద్ధి రేటుతో ఆ కంపెనీని ముందుకు తీసుకువచ్చారు. 2008లో 10 శాతం వృద్ధి రేటుతో 43.3 బిలియన్ల పెప్సికోకు ఆదాయం లభించటంలో నూయీ పాత్ర చెప్పుకోదగ్గది.

మహిళా వినియోగదారులను ఆకర్షించే రీతిలో నూయీ... స్మార్ట్ ఫుడ్ పేరుతో లో ఫ్యాట్ పాప్‌కార్న్ క్లస్టర్స్, లో కెలోరి ట్రాప్ 50, స్టార్‌బక్స్ ఫ్రాప్పుసినో లైట్ తదితర ఆహార పదార్థాలను వినియోగంలోకి తీసుకువచ్చారు. రాబోయే మూడేళ్ల కాలంలో పెప్సీ సంస్థ సేల్స్‌ను మరింతగా అభివృద్ధి చేసేందుకు సాఫ్ట్‌డ్రింక్‌‌లకుగానూ కోసం 1.2 బిలియన్ డాలర్లను ఉత్తర అమెరికాలో ఖర్చుచేయనుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

Show comments