తొలిసారిగా కువైట్ పార్లమెంట్‌కు నలుగురు మహిళలు

Webdunia
కువైట్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నలుగురు మహిళలు ఆదేశ పార్లమెంట్‌కు తొలిసారిగా ఎంపికై చరిత్ర సృష్టించారు. వీరిలో... అసీల్ అల్ అవధి, రులా దస్తీ మరియు 2005లో మొట్టమొదటి మహిళా మంత్రిగా పనిచేసిన మాజీ ఆరోగ్య మంత్రి మస్సౌమా అల్ ముబారక్, సల్వా అల్ జాసర్ అనే నలుగురు మహిళలు ఉన్నారు.

ఓ ప్రాంతం నుంచి ఎన్నికైన మొదటి పదిమందిలో అవధి రెండవ అభ్యర్థిగా, రులా 7వ అభ్యర్థిగా నిలిచి తమ సత్తాను చాటుకోగా, ఇస్లామిస్ట్ గ్రూపులు మాత్రం పరాజయాన్ని చవిచూశాయి. ఇస్లామిక్ దేశమైన కువైట్‌లో ఇప్పటివరకూ పురుషుల ఆధిపత్యమే కొనసాగుతూ వస్తోన్న సంగతి విదితమే. 2005లో అక్కడి మహిళలకు ఓటు హక్కును కల్పించారు.

2006, 2008 లో జరిగిన ఎన్నికల్లో మహిళలెవరూ గెలవలేకపోయారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో మాత్రం 50 సీట్లు కలిగిన పార్లమెంటుకు 210 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 16 మంది మహిళలు కాగా, వీరిలో పై నలుగురు విజయం సాధించి.. పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఫలితాల అనంతరం అవధి మాట్లాడుతూ... కువైట్ ప్రజాస్వామ్యంలో మహిళలకు దక్కిన విజయమని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని తెలుసని, అయితే రెండో స్థానంలో నిలుస్తానని మాత్రం ఊహించలేదని ఆమె అన్నారు. కాగా... అవధి కువైట్ యూనివర్సిటీలో పొలిటికల్ ఫిలాసఫీ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె టెక్సాస్‌లోని అస్టిన్ యూనివర్సిటీనుంచి డాక్టరేట్‌ను పొందారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

Show comments