Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వారికి రక్షణ కరువేనా..? : సుజన

Webdunia
శుక్రవారం, 16 జనవరి 2009 (14:54 IST)
" అమెరికాలో తెలుగు ప్రజలకు రక్షణ కరువేనా...?! అంటూ మంగళవారం హత్యకు గురయిన విశాల్ అక్షయ్ సోదరి సుజన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థతో సుజన మాట్లాడుతూ... అగ్రరాజ్యంలో వరుసగా తెలుగు విద్యార్థులు, ఉద్యోగస్తులపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని ఆవేదన చెందారు.

ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం కళ్లుతెరచి, తెలుగు ప్రజలకు తగిన భద్రతను కల్పించాలని ఈ సందర్భంగా సుజన అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన సోదరుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా తమ దేశానికి తరలించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

కాల్పులు జరిగేందుకు అరగంట ముందే విశాల్ తమతో ఫోన్‌లో మాట్లాడాడనీ, అంతలోనే ఇంత దారుణం జరిగిపోయిందని సుజన కన్నీరుమున్నీరైనారు. డబ్బు కోసమే తమ సోదరుడిని దుండగులు పొట్టన బెట్టుకుని ఉంటారని ఆమె వాపోయింది.

ఇదిలా ఉంటే... అమెరికాలోని ఆర్కెన్సిస్ లిటిల్ రాక్ పట్టణంలో ఓ నల్లజాతి ముష్కరుడు జరిపిన కాల్పుల్లో సుజన సోదరుడు విశాల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం.. విశాల్ హత్యకేసులో నిందితుడుగా భావిస్తున్న జాన్సన్స్ అనే నల్లజాతీయుడిని లిటిల్ రాక్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments