Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీత హత్య కేసు : భర్తకు బెయిల్, మరో ఆరుగురి అరెస్ట్

Webdunia
FILE
లండన్‌లో దారుణ హత్యకు గురైన ప్రవాస భారతీయ మహిళ గీత అలాక్ హత్య కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. కాగా... గీత హత్యతో సంబంధం ఉన్నట్లుగా అనుమానించి ఇప్పటికే అరెస్టు చేసిన ఆమె మాజీ భర్త, మరో ఆరుగురు వ్యక్తులను బెయిల్‌పై విడుదల చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. స్థానిక సన్‌రైజ్ రేడియో స్టేషనులో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న గీత.. తన పిల్లలను స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు సోమవారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి వెళ్లారు. అరగంట తర్వాత పశ్చిమ లండన్‌లోని గ్రీన్‌ఫోర్డ్‌లో దాడికి గురయ్యారు.

ఈ దాడిలో గీత దేహం నుంచి శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, ఆమె కుడిచేయి శరీరం నుంచి విడిపోయింది. దీంతో భయభ్రాంతులకు గురయిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. న ఆమె మరణించారు. తీవ్ర గాయాలతో స్థానిక చారింగ్ క్రాస్ ఆసుపత్రిలో చేరిన ఆమె.. నాలుగ్గంటలపాటు ప్రాణాలతో పోరాడి, రాత్రి 11.20 గంటల ప్రాంతంలో ప్రాణాలు విడిచారు.

ఏడాది క్రితమే తన భర్త హర్‌ప్రీత్ నుంచి విడిపోయిన గీత... అందరితో సరదాగా ఉండేది. అంత మంచి వ్యక్తి దారుణ హత్యకు గురికావటంతో ఆమె స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందో తమకు అర్థం కావటం లేదని సహ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

Show comments