ఎన్నారై మహిళపై ఫోర్జరీ కేసు

Webdunia
ప్రభుత్వాన్ని మోసగించి సుమారు లక్ష పౌండ్ల సహాయాన్ని పొందారన్న నేరారోపణతో భారత సంతతికి చెందిన మహిళ ఒకరు తన భాగస్వామితో కలిసి బ్రిటన్‌లో విచారణ ఎదుర్కొంటున్నారు. శశి బచెతా అనే 52 సంవత్సరాల మహిళ, ఆమె భాగస్వామి జెఫ్రీ కోల్స్ (58)లు ఈ మోసానికి పాల్పడినట్లు లండన్ ప్రభుత్వం వెల్లడించింది.

2002-08 సంవత్సరాల మధ్య కాలంలో శశి, జెఫ్రీలు పై అక్రమాలకు పాల్పడ్డారంటూ... గత సంవత్సరం జనవరి నెలలో బ్రిటన్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులో వీరిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం జైలుశిక్షపై తీర్పును వాయిదా వేసింది. కాగా, వీరిరువురికీ మూడు సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉండగా, ప్రస్తుతం నిందితులు బెయిల్‌పై విడుదలయినట్లు ఆ దేశ వర్గాలు ఉటంకించాయి.

ఇదిలా ఉంటే... లండన్ నగరంలోనే భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మారుతి విచారణ కమిటీ అధ్యక్షుడు స్వర్గీయ అలక్ చంద్రగుప్తా సతీమణి షీలా గుప్తా కన్నుమూశారు. కాగా, ఆమె వయస్సు 74 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె బ్రిటన్‌లోని గిల్డ్‌ఫోర్డ్‌లో ఉన్న రాయల్ సర్రీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం షీలా లండన్‌లో పలు కార్యక్రమాలు చేపట్టడం గమనార్హం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Davos: జనవరి 19 నుంచి జనవరి 23 వరకు చంద్రబాబు దావోస్ పర్యటన

మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్లను వద్దనే వద్దంటున్న కంపెనీ

తల్లి కళ్ళెదుటే ఇంటర్ విద్యార్థినిని గొంతు కోసి చంపేశాడు...

Harish Rao: ఆంధ్రాలో స్విచ్ వేస్తే, తెలంగాణలో బల్బ్ వెలుగుతుంది.. హరీష్ రావు

రోడ్డుకు అడ్డంగా బైకులు పార్క్ చేశారు.. తీయమన్నందుకు డ్రైవర్ గొంతు కోశారు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

Show comments