Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకూ పూజ్య బాపూజీయే ఆదర్శప్రాయుడు

Webdunia
భారత స్వాతంత్ర్య పోరాటోద్యమ సమయంలో మహాత్మాగాంధీ చేపట్టిన కార్యక్రమాలు అమెరికాపై కూడా ప్రభావం చూపాయనీ.. ఆయన ఆలోచనలు అగ్రరాజ్యంలో నూతన రాజకీయ మార్పులకు నాంది పలికాయని అమెరికాలోని భారత రాయబారి మీరాశంకర్ వ్యాఖ్యానించారు.

కాలిఫోర్నియాలోని శాన్‌డిగోలో 26వ మహాత్మాగాంధీ స్మారక ఉపన్యాసం ఇచ్చిన సందర్భంగా మీరా శంకర్ మాట్లాడుతూ... అహింసద్వారా ఎలాంటిదాన్నయినా సాధించవచ్చునని భారత జాతిపిత మహాత్మాగాంధీ, హక్కుల కార్యకర్త మార్టిన్ లూథర్ కింగ్‌ జూనియర్‌లు ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు.

శాన్‌డిగో ఇండియన్ అమెరికన్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మీరా శంకర్ మాట్లాడుతూ.. ప్రముఖ తత్వవేత్త హెన్రీ డేవిడ్ థోరో ప్రతిపాదించిన పౌర ఉల్లంఘన ప్రభావంతో గాంధీజీ సత్యాగ్రహోద్యమాన్ని చేపట్టారన్నారు. మహాత్ముడి జీవితం సమస్త అమెరికాతరాన్ని ప్రభావితం చేశాయని ఆమె చెప్పారు.

ఈ సందర్భంగా 17 మంది విద్యార్థులకు మహాత్మాగాంధీ స్మారక స్కాలర్‌షిప్‌లను మీరా శంకర్ ప్రదానం చేశారు. అలాగే నలుగురు విద్యార్థులకు ఏవీఐడీ (ఎడ్వాన్స్‌డ్ వయా ఇండివిడ్యువల్ డిటర్మినేషన్) స్కాలర్‌షిప్‌లను కూడా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేనేజ్‌మెంట్ గురు సీకే గుప్తా, మారి అన్నిఫాక్స్ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

Show comments