Webdunia - Bharat's app for daily news and videos

Install App

డల్లాస్‌ విరాళాల విందుకు పురంధరేశ్వరి

Webdunia
FILE
భారత కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి... డల్లాస్‌లో జరుగనున్న ఓ విరాళాల విందుకు హాజరుకానున్నారు. ఆస్టిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌‌లో తెలుగు భాషా బోధన కోసం నిధులు సేకరించే నిమిత్తం ఈ విందు సెప్టెంబర్ 26వ తేదీన జరుగనుంది.

ఈ విందు సమావేశానికి హాజరు కావాల్సిందిగా తాము పంపిన ఆహ్వానానికి పురంధరేశ్వరి సహృదయంతో అంగీకరించారని...ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రెసిడెంట్ (ఎలెక్ట్) ప్రసాద్ తోటకూర ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా... టెక్సాస్ వర్సిటీలో తెలుగు భాషా బోధనా కోర్సును రెండు సంవత్సరాల క్రితమే తానా ప్రారంభించిన సంగతి పాఠకులకు తెలిసిందే.

ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ... యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ప్రస్తుతం 30 మందికి పైగా విద్యార్థులు తెలుగు భాష కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులోనూ అమెరికాకు చెందిన విద్యార్థులతో పాటు తెలుగు వారసత్వానికి ఎలాంటి సంబంధం లేని ఇతరులు కూడా తెలుగు భాష కోర్సు చేస్తుండడం విశేషం అన్నారు.

ఈ కోర్సులో చేరే విద్యార్థులకు తెలుగును సులభంగా చదవడం, రాయడం, మాట్లాడడం... తదితర విషయాలలో యూనివర్సిటీ అధ్యాపకులు చాలా చక్కటి శిక్షణను అందిస్తున్నారని ప్రసాద్ తోటకూర సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ విందు సమావేశంలో పాల్గొని ఓ మంచి కార్యక్రమానికి మద్ధతివ్వాలని కోరుకునేవారు తనను 817-300-4747 అనే ఫోన్ నెంబర్‌లోగానీ... ప్రసాద్‌తోటకూ ర@ జిమెల్.కామ్‌ అనే మెయిల్ అడ్రస్సులోగానీ సంప్రదించవచ్చునని ప్రసాద్ తోటకూర వివరించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments