Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెనడా అందగత్తెలుగా లీసారే, రూబీధల్లా

Webdunia
కెనడా అందగత్తెలుగా భారత సంతతికి చెందిన నటి లీసారే, కెనడా రాజకీయ నాయకురాలు రూబీధల్లాలు చోటు సంపాదించారు. "హలో మేగజీన్" విడుదల చేసిన 50 మంది సుందరాంగుల జాబితాలో ఈ ఇద్దరు ఎన్నారై సుందరాంగులు చోటు దక్కించుకున్నారు.

కాగా... సిక్కు సంతతికి చెందిన రూబీధల్లా, కెనడా రాజకీయాల్లో మోస్ట్ బ్యూటిఫుల్ రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇక లీసారే, దీపామెహతా రూపొందించిన "వాటర్" అనే సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇదిలా ఉంటే... లీసారే తెలుగు చిత్రం "టక్కరి దొంగ"లో కూడా నటించించిన సంగతి పాఠకులకు విదితమే.

ఈ సందర్భంగా లీసారే మీడియాతో మాట్లాడుతూ... "ఈ జాబితాలో స్థానం లభిస్తుందని తాను ముందుగానే ఊహించానని, ఇందుకు తన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని" అని సంతోషం వ్యక్తం చేసింది. కాగా... 37 సంవత్సరాల లీసారే టొరంటోలో జన్మించింది. ఈమె తండ్రి బెంగాల్‌కు చెందినవారు.

మొదట జర్నలిజం విద్యను అభ్యసించాలని అనుకున్న లీసారే... ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి, ఆపై నటిగా నిలదొక్కుకుంది. ఇకపోతే... కెనడా గాయకుడు షానియా త్వైన్ ఈ సుందరాంగుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments