Webdunia - Bharat's app for daily news and videos

Install App

తానా విందు భోజనం... పసందు భోజనం... జూలై 2,3,4 తేదీలలో...

Webdunia
బుధవారం, 6 మే 2015 (20:39 IST)
జూలై 2,3,4 తేదీలలో డిట్రాయిట్ నగరంలో జరుగనున్న 20వ తానా మహాసభల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సుమారు 10,000 మంది హాజరయ్యే ఈ కార్యక్రమాలకు నోరూరించే వంటకాలు అక్కడే వండి వడ్డించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫుడ్ కమిటీ చెప్పిన విశేషాలు...

 
ప్ర- తెలుగువారు భోజనప్రియులన్న విషయం జగమెరిగిన సత్యం... వెబ్ సైట్లో ఇచ్చిన మెనూ చూస్తే ఇప్పుడే నోరూరుతోంది... ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి...?
కమిటీ- తానా వారి భోజన మాధుర్యం చెప్పడం కాదు కానీ రుచి చూడాల్సిందే. మా ఫుడ్ కమిటీ టీం వంట విషయంలో చాలా అనుభవం ఉన్నవారు. ఈ దేశంలోనూ ఇంకా మన దేశంలోనూ ప్రత్యేక హోటళ్లలో స్పెషల్ వంటల తయారీ విధానం తెలుసుకుని మన తెలుగువారికి ప్రత్యేక వంటకాలు గుర్తుకువచ్చేలా మెనూను తయారు చేశాము. స్థానిక భారతీయ హోటళ్ల చెఫ్‌లు ఇంకా మా టీమ్ వారికి తెలిసిన వంట స్పెషలిస్టుల సహకారంతో ప్రత్యేక వంటల సరళి తయారూ చేస్తున్నాము. భోజన పంక్తులు సాఫీగా జరిగేలా ప్లాన్ చేస్తున్నాము.
 
ప్ర- ఈ వంటలన్నీ వండటానికి ప్రత్యేకంగా భారతదేశం నుంచి చెఫ్‌లను పిలుస్తున్నారా...? స్థానిక భారతీయ హోటళ్ల సహాయసహకారాల గురించి చెప్పండి?
కమిటీ- ఉత్తర అమెరికాలో ఉన్న స్వదేశీ వంటలు చేసే అనుభవజ్ఞులైన స్పెషల్ చెఫ్‌లతో వంటలు తయారుచెయ్యడం జరుగుతుంది. స్థానిక భారతీయ హోటళ్ల యజమానులు చాలా సహకరిస్తున్నారు.
 
ప్ర- ఏయే సమయాల్లో ఏమేమి ఉండబోతున్నాయి?
కమిటి- తానా అతిథుల విందు, ఉదయాన్నే స్వల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి స్పెషల్ శాకాహార, మాంసాహార భోజనాలతో పండ్లు, పిండి వంటలతో ఇంకా తేనీరు పానీయాలతో కూడి ఉంటుంది.
 
ప్ర- ప్రతిసారి భోజనాలకు మళ్లీ ప్రత్యేక రుసుమ ఏమైనా చెల్లించాలా...?
కమిటీ- తానాలో రిజిస్ట్రేషన్ చేసినందువలన భోజనానికి ప్రత్యేక రుసుము ఏమీ లేదు.
 
ప్ర- పదార్థాల నాణ్యత గురించి చెప్పండి?
కమిటీ- మా ఫుడ్ కమిటీ టీంవారు ప్రత్యేక శ్రద్ధతో వంటలు, స్వీట్స్, పచ్చళ్లు, కూరలు రుచికరంగా, శుద్ధిగా స్వచ్చతతో తయారు చేయించాలని ఏర్పాట్లు చేస్తున్నాము.
 
ప్ర- తెలుగువారి ప్రత్యేక వంటకాలైన గోంగూర, గుత్తొంకాయ వంటివి చేస్తున్నారా...?
కమిటీ- తానా విందులో ఆ ప్రత్యేకమైన వంటకాలే కాకుండా చక్కెర పొంగలి, పులిహోర, పూర్నాలు, వడలు, రాజుగారి కోడి పలావ్, నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ బిర్యాని ఇంకా నోరూరించే పచ్చళ్లు, స్వీట్లతో పాటు పిల్లలకు ఇష్టమైన అమెరికా స్పెషల్స్ ఇంకెన్నో ఉంటాయి.
 
ప్ర- పూటకు సుమారు ఎంతమందికి భోజనాలు సిద్ధం చేస్తారు... ఆహారం వృధా కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
కమిటీ- తానా 2015 మహాసభలకు ఎనిమిది వేలకు పైగా అతిథులు వస్తారని అంచనా. వారందరికి సరిపోయేంత ప్రమాణంలో వీలైనంతలో ఏ పదార్థాలు వృధా కాకుండా వంటలు తయారుచేయించాలనేది మా ప్రయత్నం. ఇంకా ఎక్కువమంది అతిథులు వస్తేకూడా అందరికి భోజనాలు అందించాలని ప్రణాళిక వేస్తున్నాము.
 
ప్ర- ఒకసారి కార్యక్రమం ప్రారంభమయ్యాక, ఏ సమయంలో ఎక్కడ ఏమి దొరుకుతుందనే వివరాలు తెలుసుకొనగోరేవారు ఎలా తెలుసుకోవచ్చు...
కమిటీ- భోజన సమయాలు, భోజన హాలు డైరెక్షన్ వివరంగా ప్రచురిస్తాం.
 
ప్ర- ఇక్కడ ఉంటున్న ప్రవాస భారతీయులు ఏవైనా పచ్చళ్ల లాంటివి కొనుక్కునే వీలుందా...?
కమిటీ- ప్రియ పచ్చళ్లు కానీ ఇతర పచ్చళ్ల డిస్ట్రిబ్యూటర్లు అమ్మే స్టాళ్లు పెడితే, పచ్చళ్లు కొనుగోలు చేయవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kartik Aaryan- Sreeleela: కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం? డిన్నర్‌కు? (video)

రామాయణం: సీత పాత్రకు సాయి పల్లవి యాప్ట్ కాదంటోన్న నెటిజన్లు.. ట్రోల్స్ మొదలు

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

Show comments