Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిదండ్రుల తృప్తి కోసమే తెలుగు అమ్మాయిలు... ఎన్నారై అబ్బాయిల వరస ఇదీ...

ఎన్నారై సంబంధం అనేది ఎప్పటి నుంచో అదో క్రేజ్. మా అల్లుడు అమెరికాలో వుంటున్నాడు.. మా అబ్బాయి లండన్‌లో వుంటున్నాడు అని చెప్పుకుని మురిసిపోయేవారు చాలామందే. ఐతే విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిన ఎన్నారై అబ్బాయిలు ఇండియాలో వుండే తమ తల్లిదండ్రుల తృప్తి

Webdunia
గురువారం, 15 ఫిబ్రవరి 2018 (21:14 IST)
ఎన్నారై సంబంధం అనేది ఎప్పటి నుంచో అదో క్రేజ్. మా అల్లుడు అమెరికాలో వుంటున్నాడు.. మా అబ్బాయి లండన్‌లో వుంటున్నాడు అని చెప్పుకుని మురిసిపోయేవారు చాలామందే. ఐతే విదేశాల్లో చదువుకుని అక్కడే స్థిరపడిన ఎన్నారై అబ్బాయిలు ఇండియాలో వుండే తమ తల్లిదండ్రుల తృప్తి మేరకు మాత్రమే ఇక్కడి అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకుంటున్నారట. అలాంటి రాష్ట్రాల్లో ముందువరుసలో వుంటున్నవి తెలుగు రాష్ట్రాలని గణాంకాలు చెపుతున్నాయి. ఆ తర్వాత పంజాప్, గుజరాత్ రాష్ట్రాలు వుంటున్నాయట. 
 
విదేశీ ఉద్యోగం, డాలర్ల డబ్బు, అమ్మాయికి ఎలాంటి ఢోకా వుండదు అనుకునేవారికి ఇదో చేదు వార్తే. ఎందుకంటే విదేశీమంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య కాలంలో... అంటే 1064 రోజులకు గాను విదేశాల్లో నివాసముంటున్న ఎన్నారై భార్యల నుంచి 3,328 ఫిర్యాదులు వచ్చాయట. ఈ ఫిర్యాదుల్లో తమతమ భర్తలు తమను కట్నం కోసం వేధిస్తున్నారనో, తమను చిన్నచూపు చూస్తున్నారనో, ఇంకా హింసిస్తున్నారనో పేర్కొన్నారట.
 
వాషింగ్టన్ లోని భారతదేశ విదేశీ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్తీ రావు మాట్లాడుతూ... తమకు ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వెనువెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తెలుగు ఎన్నారై మహిళలను కట్నం కోసమే వేధిస్తున్నట్లు తమకు అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులను తృప్తి పరిచేందుకే ఇక్కడ పనిచేసే ఎన్నారై అబ్బాయిలు తెలుగు రాష్ట్రాలకు వెళ్లి తెలుగు అమ్మాయిలను పెళ్లాడుతున్నారనీ, పెళ్లయ్యాక చాలామంది వారి భార్యలను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments