Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా డే పరేడ్‌లో నాట్స్, న్యూయార్క్ వీధుల్లో హోరెత్తిన జై భారత్ నినాదాలు

Webdunia
బుధవారం, 24 ఆగస్టు 2022 (17:55 IST)
ఆజాదీ కా అమృతోత్సవ్‌లో భాగంగా న్యూయార్క్ నగరంలో జరిగిన 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో  నాట్స్ నాయకులు, సభ్యులు పాల్గొని జన్మభూమి పట్ల తమకు ప్రేమను చాటారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎఫ్.ఐ.ఏ ఏర్పాటు చేసిన ర్యాలీలో నాట్స్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 
ఇరు తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా ఉన్న ఈ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి( బాపు) నూతి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ సెక్రటరీ శ్యామ్ నాళం, ఇమ్మిడియట్ పాస్ట్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, పాస్ట్ ఛైర్మన్ శ్యామ్ మద్దాలి, నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, చంద్రశేఖర్ కొణిదెల, ఆది గెల్లి, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగతావుల, నార్త్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ గురు కిరణ్ దేసు, నాట్స్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్  రామ్ కొమ్మనబోయిన, కిరణ్ తవ్వా తదితరులు ఈ కార్యక్రమం  పాల్గొన్నారు.

 
ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకుల తో పాటు, స్థానిక తెలుగు సంస్థల సభ్యులు, డాన్స్ స్కూల్ పిల్లలు కూడా పాల్గొని ఈ ఉత్సవంలో ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమం ఆసాంతం భారత్ మాతా కీ జై! వందేమాతరం! జై హింద్ వంటి నినాదాలతో న్యూయార్క్ నగరం హోరెత్తింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పహల్గామ్‌ మృతుడు మధుసూధన్ రావుకు పవన్ నివాళులు

Pahalgam: పహల్గమ్‌ బాధితులకు పూర్తిగా ఉచిత వైద్య చికిత్స: ముకేష్ అంబానీ

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

తర్వాతి కథనం
Show comments