Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ పైన కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు ప్రశంసల వర్షం

న్యూఢిల్లీ : భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు నాట్స్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ ఇస్తున్న మద్దతు అభినందనీయమన్నారు. తెలుగునాట కూడా నాట్స్ చేపడు

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:13 IST)
న్యూఢిల్లీ : భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు నాట్స్ పైన ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాలో తెలుగువారికి నాట్స్ ఇస్తున్న మద్దతు అభినందనీయమన్నారు. తెలుగునాట కూడా నాట్స్ చేపడుతున్న కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా జరిగే అమెరికా తెలుగు సంబరాలకు ఆహ్వానం పలికేందుకు నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట, నాట్స్ బోర్డు అఫ్ డైరెక్టర్ టి.జి. విశ్వప్రసాద్, సి.టి ఏ. నాట్స్ ప్రతినిధి శ్రీధర్ ముంగండి తదితరులు ఢిల్లీలో అశోక్ గజపతిరాజును కలిసి సంబరాలకు ఆహ్వానించారు. 
 
సేవాపథంలో నడిచే నాట్స్‌కు తన పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. అమెరికాలో ప్రమాదవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను భారత్‌కు రప్పించడంలో నాట్స్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు ఎయిర్ ఇండియా విమానాల ద్వారానే తాము అమెరికా నుంచి ఇండియాకు పార్థీవ దేహాలను తరలిస్తున్నామని .. అయితే దీనికి అయ్యే ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నాట్స్ ప్రతినిధులు కేంద్రమంత్రిని కోరారు. ఈ విషయంలో తన పూర్తి మద్దతు ఉంటుందని  అశోక్ గజపతి రాజు హామీ ఇచ్చారు. 
 
ఇకముందు ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ ద్వారా కూడా పార్థీవ దేహాలను తరలించేందుకు తన వంతు సాయం చేస్తానని అశోక్ గజపతిరాజు హామీ ఇచ్చారు. నాట్స్ సంబరాలకు రావాలన్న ఆహ్వానంపై కూడా అశోక్ గజపతి రాజు సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత నాట్స్ ప్రతినిధులు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును కలిశారు. తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నందుకు తమకు ఎంతో గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా నాట్స్ ప్రతినిధులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అటు న్యాయవాద వృత్తితో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకునే లావు నాగేశ్వరరావు నాట్స్ సేవాపథాన్ని ప్రశంసించారు. సంబరాలకు రమ్మంటూ నాట్స్ ఇచ్చిన ఆహ్వానంపై కూడా ఆయన సానుకూలంగా స్పందించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Folk Singer: ప్రేమ పెళ్లి బాగానే జరిగింది.. కానీ జానపద గాయని ఆత్మహత్య.. ఎందుకు?

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2

ఓజీలో ఐటెం సాంగ్ కు సిద్ధమవుతున్న నేహాశెట్టి !

యాక్షన్ థ్రిల్లర్ గా కిచ్చా సుదీప్ మ్యాక్స్ డేట్ ఫిక్స్

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వాణీ కెమిస్ట్రీ హైలైట్ చేస్తూ డోప్ సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments