డాలస్‌లో పోలీస్ సిబ్బందికి నాట్స్ భోజనం: కరోనాపై ముందుండి పోరాడే వారికి ప్రోత్సాహం

Webdunia
గురువారం, 18 జూన్ 2020 (20:04 IST)
అమెరికాలో కరోనాపై ముందుండి పోరాడుతున్న వారిని ప్రోత్సాహించేందుకు.. ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా నాట్స్ డాలస్ విభాగం నార్త్ రిచర్డ్ హిల్స్ పోలీస్ సిబ్బందికి భోజనం ఏర్పాటు చేసి వారి సేవలను ప్రత్యేకంగా అభినందించింది. నాట్స్ ఉపాధ్యక్షుడు బాపు నూతి చొరవతో స్థానికంగా ఉండే 50 మంది పోలీస్ సిబ్బందికి ఈ మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు చేసింది.
 
నాట్స్ సభ్యులే స్వయంగా వెళ్లి.. సిద్ధం చేసిన ఆహారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అందించారు. నాట్స్ చేసే అనేక స్థానిక కార్యక్రమాలకు గత పదేళ్లుగా స్థానిక పోలీస్ అధికార్లతో బాపు నూతి సంప్రదింపులు జరుపుతూ ఉండేవారు. ఈ అనుబంధంతో నాట్స్ విందును పోలీస్ అధికారులు అనుమతించడం జరిగింది.
 
పోలీస్ సిబ్బందిని ప్రోత్సాహించేందుకు నాట్స్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని నార్త్ రిచర్డ్ హిల్స్ పోలీస్ చీఫ్ జిమ్మీ పర్డ్యూ అన్నారు. నాట్స్ టీంను ఆయన ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు రాజేంద్ర మాదల, ప్రసాద్ డి వి, కవిత దొడ్డ, శ్రీధర్ న్యాలమడుగుల, శ్రీనివాస్ పాటిబండ్ల, యూత్ వాలంటీర్లు మనోజ్ఞ, రేహాన్ తదితరులు పాల్గొన్నారు.
 
కరోనాపై పోరాడే ఫ్రంట్లైన్ వర్కర్లను ప్రోత్సాహించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి తెలిపారు. నాట్స్ డాలస్ విభాగం ఈ విషయంలో చూపుతున్న చొరవను వారు ప్రశంసించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

నవంబర్ 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments