Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో చినబాబు బిజీ బిజీ

చైనా పర్యటనలో ఉన్న నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు అంతా కలిసే ఉండాలని అన్నారు. రె

Webdunia
సోమవారం, 17 సెప్టెంబరు 2018 (21:30 IST)
చైనా పర్యటనలో ఉన్న నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు అంతా కలిసే ఉండాలని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం చైనాలో ఉన్న తెలుగు వాళ్లు కృషి చెయ్యాలన్నారు. 
 
రాయలసీమకు నీళ్లు తీసుకొని వెళ్లడం వలన వెనుకబడిన జిల్లా అనుకున్న అనంతపురం జిల్లాకి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియా వచ్చిందన్నారు. ఏపీలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్‌లో చైనా అందరికంటే ముందు ఉంది. ఈ రంగంలో చైనాని ఆదర్శంగా తీసుకొని.. ఏపీలో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. 
 
ఇక రెండవరోజు సీఈటీసీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్‌ బిన్‌తో లోకేష్‌ భేటీ అయ్యారు. సీఈటీసీ ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ సోలార్‌ ఎనర్జీ విడి పరికరాలను తయారుచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

రండి మేడం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి దిగబెడతాం అని చెప్పి అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 699 మంది అభ్యర్థుల పోటీ... కేజ్రీవాల్‌పై 23 మంది పోటీ...

ష్... నిశ్శబ్దంగా ఉండండి.. డిప్యూటీ సీఎం వివాదంపై జనసేన ఆదేశాలు

అధ్యక్ష పీఠంపై డోనాల్డ్ ట్రంప్ - అక్రమ చొరబాటుదారుల వెన్నులో వణుకు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాసం రాజా ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణ

విశ్వక్సేన్, లైలా సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ రాబోతుంది

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో సత్యరాజ్, ఉదయ భాను చిత్రం బార్భరిక్

ఒక పథకం ప్రకారం..లో విలన్ ఎవరో చెబితే 10 వేలు ఇస్తాం - సాయిరాం శంకర్

Dil Raju కార్యాలయాల్లో ఐటీ దాడుల్లోనూ అధికారులు తగ్గేదేలే, రహస్యమేమిటి?

తర్వాతి కథనం
Show comments