సూపర్ కంప్యూటర్ సృష్టికర్త మన ఆంధ్రుడే...!!

Webdunia
FILE
ఊహాతీతమైన వేగంతో లెక్కింపులు చేసే సామర్థ్యం కలిగిన సూపర్ కంప్యూటర్‌ను అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుడు ఆలూరు శ్రీనివాస్ రూపొందించారు. క్షణానికి 28.16 లక్షల కోట్ల లెక్కింపులు చేయగల ఈ అద్భుతమైన సూపర్ కంప్యూటర్‌ను సృష్టించిన శ్రీనివాస్... అయోవా స్టేట్ వర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

" సిస్టార్మ్" అనే పేరుతో రూపొందించిన ఈ కంప్యూటర్ అయోవా స్టేట్ వర్సిటీలోని సూపర్ కంప్యూటర్లలో రెండవదిగా పేరు సంపాదించింది. ఐబీఎం సంస్థ రూపొందించిన బ్లూజీన్/ఎల్ సూపర్ కంప్యూటర్ (సిబ్లూ) 2006లో ఈ వర్సిటీ క్యాంపస్‌లోకి అడుగు పెట్టింది. అది సెకనుకు 5.7 లక్షల కోట్ల లెక్కింపుల్ని మాత్రమే చేయగలదు.

అయితే తాజాగా మన ప్రవాసాంధ్రుడు శ్రీనివాస్ రూపొందించిన సూపర్ కంప్యూటర్ మాత్రం సెకనుకు 28.16 లక్షల కోట్ల లెక్కింపుల్ని చేయగలదు. అయితే సిస్టార్మ్‌కు ప్రపంచంలో వేగవంతమైన సూపర్ కంప్యూటర్ల జాబితాలో మాత్రం ఇంకా చోటు లభించలేదు. మూడేళ్ల కిందటే ఆన్‌లైన్‌లోకి వెళ్లిన సిబ్లూ ఈ జాబితాలో 99వ స్థానంలో ఉండటం గమనార్హం.

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ... సూపర్ కంప్యూటర్ పరీక్షల్లో వాస్తవంగా సిస్టార్మ్ సెకనుకు 15.44 లక్షల కోట్ల లెక్కింపుల్ని చేయగలిగిందని, దీనికి ముందు అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందిన సిబ్లూ సెకనుకు 4.7 లక్షల కోట్ల లెక్కింపుల్ని మాత్రమే చేయగలిగిందని చెప్పారు.

సిబ్లూ కంటే తాజాగా తాను రూపొందించిన సిస్టార్మ్ 3.3 రెట్లు వేగంగా పనిచేయగలదని శాస్త్రీయంగా కూడా రుజువైందని శ్రీనివాస్ వివరించారు. కాగా... పదార్థ శాస్త్రాలు, పవర్ సిస్టమ్స్, సిస్టమ్స్ బయోలజీ లాంటి శాస్త్రాలలో పరిశోధనలకు అనువుగా సిస్టార్మ్ సూపర్ కంప్యూటర్‌ను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తూర్పు గోదావరి జిల్లాలో స్కూల్ బస్సు బోల్తా.. 25మంది విద్యార్థులకు ఏమైంది..?

ఆధార్ కార్డులో సవరణలు.. ఇకపై సేవా కేంద్రాలకు వెళ్లనక్కర్లేదు.. ఇంటి నుంచే మార్పులు

మైనర్ దళిత బాలికపై ఆటో రిక్షా డ్రైవర్ అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లి..?

శానిటైజర్ తాగించి, తుపాకీతో బెదిరించి లైంగికంగా వేధించారు.. మహిళా కానిస్టేబుల్‌కే ఈ పరిస్థితి

సాంబారు పాత్రలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి.. పుట్టినరోజుకు ఒక్క రోజు ముందే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 అఖండ 2 సినిమా విడుదల తనకు బ్యాడ్ లక్ అంటున్న దర్శకుడు

Ravi Teja: అద్దం ముందు.. పాటలో రవితేజ, డింపుల్ హయతి

Japan Earthquake: డార్లింగ్ ప్రభాస్ ఎక్కడ..? మారుతి ఏమన్నారు?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Show comments