Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీటీఏ ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఉత్సవాలు

Webdunia
FILE
భారత జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు షికాగో తెలుగు అసోసియేషన్ (సీటీఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇల్లినాయిస్‌‌లోని ఎవాన్‌స్టన్‌లో అక్టోబర్ 3వ తేదీన బాపూజీ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు సీటీఏ పేర్కొంది.

ఈ విషయమై సీటీఏ అధ్యక్షుడు రావు అచంట మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 2424 లేక్‌స్ట్రీట్‌లో ఎమ్ఎల్ కింగ్ లాబ్ పాఠశాలలో మహాత్ముడి జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తెలియజేశారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసిన తరువాత చిన్నారులకు వ్యాస రచన పోటీలను పెట్టనున్నట్లు ఆయన చెప్పారు.

ఆ తరువాత రక్తదానం కార్యక్రమం నిర్వహిస్తామనీ.. ఉత్సవాల్లో భాగంగా గాంధీజీపై నిర్మించిన డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించనున్నామని రావు అచంట పేర్కొన్నారు. ఈ మేరకు చికాగోలోని ప్రవాస భారతీయులందరూ బాపూజీ జన్మదిన వేడుకలలో పాల్గొని విజయవంతం చేయాలని సీటీఏ ఆహ్వానించింది. కాగా.. సీటీఏ మొట్టమొదటిసారిగా గాంధీ జయంతిని నిర్వహించనుండటం గమనార్హం.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments