సిక్కు కుటుంబానికి హైకోర్టు తిరస్కారం

Webdunia
గత మే నెలలో మరణించిన ఆర్ట్ డైరెక్టర్ మోహన్ సింగ్ భౌతికకాయానికి తమ మతాచారాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు, సింగ్ మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ ఆయన కుటుంబ సభ్యులు వేసిన రివ్యూ పిటీషన్‌ను మలేషియా హైకోర్టు తిరస్కరించింది.

ఇప్పటికే సివిల్ కోర్టును ఆశ్రయించిన సింగ్ కుటుంబ సభ్యులు అక్కడ తిరస్కారం ఎదురవటంతో హైకోర్టులో రివ్యూ పిటీషన్ దాకలు చేశారు. ఈ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి రోస్నాని సాబ్... సింగ్ మరణించే నాటికి ముస్లింగానే ఉన్నాడని వ్యాఖ్యానించారు.

1992 వ సంవత్సరంలో సింగ్ ముస్లిం మతం స్వీకరించినట్లు సాక్షాధారాలున్నాయని న్యాయమూర్తి వెల్లడించారు. ఇక ఈ విషయంపై పునర్విచారణ జరపాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని ఆయన తేల్చి చెప్పారు. సింగ్ ముస్లింగా మారిపోయాడు కాబట్టి, సంప్రదాయం ప్రకారమే సింగ్ అంత్యక్రియలు జరిపించటం మంచిదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే... గత మే నెల 24వ తేదీన గుండెపోటుతో మోహన్ సింగ్ స్థానిక సంగాయ్ బులాహ్ ఆసుపత్రిలో చనిపోయారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించిన ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రి వర్గాలు అనుమతించకపోవటంతో వారు కోర్టును ఆశ్రయించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Show comments