విద్యార్థుల పరామర్శకు తెదేపా బృందం

Webdunia
ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురయిన భారతీయ విద్యార్థులను పరామర్శించేందుకు, అక్కడున్న తెలుగు ప్రజలందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు... ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన వీసా, తదితర ఏర్పాట్లు పూర్తి చేసుకుని, ఒకటి, రెండు రోజులలో ఈ బృందం ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ బృందంలో తెదేపా పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు, పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిలు ఈ బృందంలో ఉంటారని ఆ పార్టీ వెల్లడించింది.

ఈ విషయమై తెదేపా విడుదల చేసిన ఓ ప్రకటనలో.. భారతీయ విద్యార్థులపై వరుసగా దాడులు జరుగుతున్నప్పటికీ ఆస్ట్రేలియా ప్రభుత్వం విద్యార్థుల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చోద్యం చూస్తోందని విమర్శించింది. అంతేగాకుండా, భారత విద్యార్థులకు వెంటనే రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే... భారత విద్యార్థులపై దాడుల నేపథ్యంలో ఆస్ట్రేలియా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. దాడుల నివారణకు వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు కొత్తగా లెబనీస్ యువతకు వ్యతిరేకంగా నినాదాలు, ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

Show comments