యూఏఈ సానుకూలంగా స్పందించాలి: భారత్ ఆశాభావం

Webdunia
FILE
దుబాయ్‌లో మరణశిక్షకు గురైన 17 మంది భారతీయుల అప్పీల్‌కు యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశిస్తోంది. మరణశిక్షకు వ్యతిరేకంగా భారత నిందితులు దాఖలు చేసిన అప్పీల్‌ను యూఏఈ బుధవారంనాడు పరిశీలించనుంది. దీంతో భారతీయుల అప్పీల్‌పై యూఏఈ సానుకూల స్పందన కోసం భారత్ ఎదురుచూస్తోంది.

కాగా.. ఒక పాకిస్తాన్ యువకుడి హత్యతోపాటు, మరో ముగ్గురు పాక్ యువకులను గాయపరిచినందుకుగానూ 17మంది భారతీయులకు మార్చి 29న షార్జాలోని షరియత్ కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే తమ తీర్పుపై భారతీయ నిందితులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందనీ యూఏఈ ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలో నిందితుల తరపున వాదించేందుకుగానూ భారత ప్రభుత్వం మొహమ్మద్ సల్మాన్ అనే న్యాయవాదిని నియమించింది.

నిందితులు మరణశిక్షకు వ్యతిరేకంగా చేసుకున్న అప్పీల్‌ను విచారించి, తీర్పును వెలువరించేందుకు రెండువారాల సమయం పడుతుందని ఈ మేరకు యూఏఈ అధికారులు చెబుతున్నారు. మరోవైపు తమ దేశ న్యాయవ్యవస్థ, చట్టాలపై పూర్తి విశ్వాసం ఉందనీ.. అదే విధంగా విచారణ విషయంలోనూ పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తామని న్యూఢిల్లీలోని యూఏఈ ఎంబసీ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరణశిక్ష కేసులో భారతీయ నిందితులకు యూఏఈ సానుకూలంగా స్పందించగలదని భారత్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

Show comments