మాంద్యం దెబ్బతో స్వదేశాలకు భారతీయులు

Webdunia
ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తోన్న ఆర్థికమాంద్యం దెబ్బకు లక్షా యాభై వేల మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి "యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)"నుంచి స్వదేశాలకు తిరిగి వచ్చినట్లు... కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖా మంత్రి వాయలార్ రవి పేర్కొన్నారు.

ఈ విషయమై వాయలార్ రవి పార్లమెంటులో మాట్లాడుతూ... యాభై వేల నుంచి లక్షా యాభై వేలమంది కార్మికులు యూఏఈ నుంచి భారత్ తిరిగి వచ్చేశారని చెప్పారు. వీరంతా ఆర్థిక సంక్షోభం దెబ్బతో ప్రాజెక్టు పనులు కొనసాగక పోవడంతో ఉపాధి కోల్పోయి ఇంటిముఖం పడుతున్నారని ఆయన వివరించారు.

చాలామంది కార్మికులు సెలవుల మీద స్వదేశం వస్తున్నారనీ, అక్కడ పరిస్థితులు మెరుగుపడితేకానీ వీరు తిరిగి వెళ్లే అవకాశాలు కనిపించటం లేదని మంత్రి రవి చెప్పారు. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్‌లలో ఉద్యోగులను తొలగించటం కొనసాగుతోందని అక్కడి భారత రాయబార కార్యాలయాలకు కూడా సమాచారం అందిందని మంత్రి తెలిపారు.

అయితే ఆప్ఘనిస్థాన్, సిరియా, సూడాన్, బ్రూనై, లిబియా, జోర్డాన్, లెబనాన్ దేశాలలోని భారతీయులపై ఆర్థికమాంద్యం ప్రభావం చూపిన దాఖలాలేమీ కనిపించటం లేదని మంతి అన్నారు. అమెరికాలోని అన్ని వర్గాలపై మాంద్య దెబ్బ పడిందని, అక్కడి భారతీయులు వృత్తి నిపుణులు కావడంతో ఉద్యోగాలు కోల్పోతున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉంటే... అమెరికా, యూఏఈలలోని భారతీయ కార్మికులకు సేవలను అందించేందుకు అక్కడి మన రాయబార కార్యాలయాలను ముందుగానే సంసిద్ధం చేసినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా వాయలార్ రవి తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

Show comments