Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియాలో ప్రవాస భారతీయుల ర్యాలీ

Webdunia
చాలా సంవత్సరాలుగా తాము నివసిస్తున్న గ్రామాన్ని ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న మలేషియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా... ప్రవాస భారతీయులు ర్యాలీ నిర్వహించారు. ఉత్తర పెనాంగ్‌లోని బుహ పాలా గ్రామంలో ఉంటున్న ప్రవాస భారతీయులందరూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ, ఆ దేశ అధికారులు ఆదేశించారు.

గతంలో అధికారంలో ఉండగా ప్రతిపక్ష కూటమి తమ పట్ల వివక్షతో వ్యవహరించిందని ప్రవాస భారతీయులు ర్యాలీ సందర్భంగా ఆరోపించారు. కాగా... బుహ పాలా గ్రామంలో దాదాపు 300 మంది ప్రవాస కుటుంబాలు నివసిస్తున్నాయి. 150 సంవత్సరాల క్రితం నుంచి వీరు ఇక్కడ నివసిస్తున్నారు.

ఎలాంటి పరిహారాన్ని ఆశించకుండా ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని మలేషియా అత్యున్నత న్యాయస్థానం ప్రవాస భారతీయులను ఆదేశించటంతో వీరంతా దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు నిరసనగానే తాము ఈ ర్యాలీని నిర్వహించామని పెనాంగ్‌కు చెందిన అనిల్ నెట్టో వెల్లడించారు.

తాము ఖాళీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసిందనీ, ఇళ్ల కూల్చివేతను వాయిదా వేస్తారన్న ఆశాభావంతో రోజులు వెల్లదీస్తున్నామని పలువురు ఎన్నారైలు వాపోయారు. ఇదిలా ఉంటే... ఈ ప్రాంతాన్ని 2005వ సంవత్సరంలో ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం అమ్మివేసింది. అయితే ఈ వ్యవహారం కాస్తా ప్రస్తుత పెనాంగ్ విపక్ష కూటమికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుదుచ్చేరిలో వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడి ఆత్మహత్య

Husband: మహిళా కౌన్సిలర్‌ను నడిరోడ్డుపైనే నరికేసిన భర్త.. ఎందుకో తెలుసా?

లింగ మార్పిడి చేయించుకుంటే పెళ్లి చేసుకుంటా..... ఆపై ముఖం చాటేసిన ప్రియుడు..

KCR: యశోద ఆస్పత్రిలో కేసీఆర్.. పరామర్శించిన కల్వకుంట్ల కవిత

Daughters in law: మహిళ వార్త విన్న కొన్ని గంటలకే మామ గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

Show comments