మన్మోహన్ జీ.. 2జీపై చర్యలు తీసుకోండి ప్లీజ్: ఎన్ఆర్ఐలు

అవినీతి నుంచి భారత్‌ను కాపాడుకుందాం: ఎన్ఆర్ఐలకు పిఎఫ్ఎల్ పిలుపు

Webdunia
File
FILE
అమెరికాతో పాటు ఇతర దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల సంస్థ "పీపుల్స్ ఫర్ లోక్‌సత్తా" అవినీతికి వ్యతిరేకంగా జాతీయ స్థాయి ప్రచారాన్ని చేపట్టింది. పార్టీలు, సిద్ధాంతాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా భారతీయ పౌరులందరూ అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది.

దేశంలో రోజుకు ఒకటిగా వెలుగుచూస్తున్న కుంభకోణాల నేపథ్యంలో ప్రజలలో చైతన్యం తీసుకురావడం, ఈ కుంభకోణాలపై సత్వరమే స్పందించాల్సిందిగా దేశాధినేతను కోరడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. ఈ కుంభకోణాలపై దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు శాంతియుతంగా తమ ఆందోళనను దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకువెళ్లాలని పిఎఫ్ఎల్ పిలుపునిచ్చింది.

ఈ మెయిల్స్, పోస్ట్ కార్డ్స్, మనీ ఆర్డర్స్, ప్రధానికి అడ్రస్ చేయబడిన ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకాలు వంటి వాటి ద్వారా ఈ విషయాన్ని ప్రధాని దృష్టి తీసుకెళ్లాలని పిఎఫ్ఎల్ నిర్ణయించింది. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సభ్యులు, లోక్‌సత్తా పార్టీ అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క రూపాయి మనీ ఆర్డర్‌ను డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు పంపి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అన్ని స్పెక్ట్రమ్ లైసెన్సులను రద్దు చేసి పునఃకేటాయించడం, ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న అవినీతి పరులను కఠినంగా శిక్షించడం, భవిష్యత్తు కుంభకోణాల నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి చట్టాలను కఠినతరం చేయడం, విండ్ ఫాల్ టాక్స్, హాంగ్‌కాంగ్ తరహా వ్యక్తిగత అవినీతి వ్యతిరేక సంస్థను స్థాపించడం వంటివి ఈ ప్రచారం ముఖ్య లక్ష్యాలు.

లక్ష సంతకాల సేకరణపై పనిచేస్తున్న హోస్టన్‌కు పిఎఫ్ఎల్ సభ్యురాలు హైమా సాగీ మాట్లాడుతూ.. "కొంత కాలం తర్వాత భవిష్యత్తులో భారత చరిత్ర పుస్తకాల్లో అవినీతి గురించి లిఖించబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే వాటిలో 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుంది. కుంభకోణాల నుంచి భారత్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉంద"ని వ్యాఖ్యానించారు.

రానున్న వారాంతంలోపు వివిధ నగరాల నుంచి ప్రధానికి వేలాది సంఖ్యలో ఈమెయిల్స్, పోస్టు కార్డులను పంపడంలో సహకరించడానికి అట్లాంటాలో నివసిస్తున్న రామ్‌గోపాల్ మాదారపు ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి పోస్టు కార్డులు మనీ ఆర్డర్లు పంపాలని పిఎఫ్ఎల్ పిలుపునిచ్చింది. ఈమెయిల్ ద్వారా తెలిజజేయాలనుకుంటే.. మన్మోహన్‌@సన్‌సద్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్, అలాగే ఆన్‌లైన్ పిటిషన్‌పై సంతకం చేయాలంటే.. డబ్య్లుడబ్య్లుడబ్య్లు డాట్ ఐపిటిషన్ డాట్‌ కామ్‌ల ద్వారా తమ నిరసన తెలుపవచ్చని పిఎఫ్ఎల్ సూచించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

చిరుత దాడుల నుంచి అడ్డుకోవాలంటే అడవుల్లోకి మేకలను వదలండి : మహా మంత్రి

Pemmasani Chandrasekhar: ఎంపీల పనితీరుపై సర్వే.. 8.9 స్కోరుతో అగ్రస్థానంలో పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

ఆస‌క్తి హ‌ద్దులు దాటితే ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే నయనం ట్రైలర్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల సమావేశం