Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు ఆస్ట్రేలియా బృందం : వయలార్

Webdunia
ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రతినిధుల బృందం జూలై నెలలో మన దేశానికి రానుందని ప్రవాస భారతీయ వ్యవహారాల శాఖా మంత్రి వయలార్ రవి న్యూఢిల్లీలో వెల్లడించారు.

ఈ విషయమై వయలార్ రవి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... 17 మంది సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంలో అక్కడి వర్సిటీల వీసీలతో పాటు ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఎన్జీవోలు ఉంటారని పేర్కొన్నారు. ఈ బృందం మన దేశంలోని వివిధ నగరాలతో పాటు హైదరాబాద్‌ను కూడా సందర్శిస్తుందని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడితో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ బృందం ప్రతినిధులు సమావేశమవుతారని వయలార్ రవి తెలిపారు. ఇదిలా ఉంటే... దాడుల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఇటీవల ఆస్ట్రేలియాలో పర్యటించిన తెలుగుదేశం నేత నామా నాగేశ్వరరావు ఈ సందర్భంగా వయలార్ రవికి ఓ వినతిపత్రం సమర్పించారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments