Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతీయతను నేర్పించాల్సిందే: గుజరాతీ ఎన్నారైలు..!

Webdunia
FILE
భారతీయ సంప్రదాయాలను, విలువలు.. మూడో తరానికి అందకుండా పోతాయేమోనని యూఎస్, యూకేలలో నివసిస్తున్న ప్రవాస భారతీయ గుజరాతీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకనే భారతీయ మూలాలను మర్చిపోకుండా ఉండేందుకు తమ తరువాత తరానికి ఇప్పటినుంచే భారతీయత గురించి తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారంటున్నారు.

గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా, బ్రిటన్‌లలో ప్రవాస భారతీయ గుజరాతీ ప్రజానీకం పెద్ద సంఖ్యలో స్థిర నివాసం ఏర్పరచుకుని జీవిస్తున్నారు. అయితే వివిధ కారణాల రీత్యా తాము విదేశాలలో ఉంటున్నప్పటికీ.. పిల్లలకు భారతీయ సంప్రదాయాలు, విలువలు అందించాల్సిన బాధ్యత తమపై ఉందనీ గుజరాతీ ఎన్నారైలు భావిస్తున్నారు. అలా భారతీయతను తమ పిల్లలకు తెలియజెప్పనిపక్షంలో వారి తరువాత తరానికి భారతీయత గురించి తెలియకుండాపోయే ప్రమాదం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్-అమెరికన్ అసోసియేషన్స్ (ఎన్ఎఫ్‌ఐఏ) అధ్యక్షుడు సీకే పటేల్ ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. విదేశీ సంస్కృతిలో పెరుగుతున్న ప్రవాస గుజరాతీలలోని మూడో తరంవారు విదేశీ మోజులో పడిపోయి భారతీయ సంప్రదాయం, సంస్కృతి, విలువలను విస్మరించే ప్రమాదం ఉన్నట్లు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. అందుకనే వారికి చిన్నవయస్సునుంచే భారతీయత గురించి తెలియజెప్పేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments