Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ బస్సు ప్రమాదం వెనుక జాతి విద్వేషం...??

Webdunia
FILE
లండన్‌లో సిక్కు మహిళలు, పిల్లలతో ప్రయాణిస్తున్న బస్సుకు సంభవించిన అగ్నిప్రమాదం వెనుక జాతివివక్ష శక్తుల ప్రమేయం ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది. లూటన్‌లోని గురుద్వారాను సందర్శించి, దక్షిణ ఇంగ్లండ్‌లోని వేమౌత్‌కు తిరిగి వస్తుండగా, జాతీయ రహదారిపై బస్సుకు నిప్పంటుకున్న సంగతి తెలిసిందే..!

ఈ ఘటనలో విధి నిర్వహణలో లేని పోలీసు ఒకరు అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అంటుకున్న సమయంలో ఆ బస్సులో 66 మంది మహిళలు, చిన్నపిల్లు ఉండగా... వారంతా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. మనసు కలచివేసే ఈ దుర్ఘటన మూడు రోజుల క్రితం జరిగింది.

అయితే బస్సునుంచి క్షేమంగా బయటపడిన సిక్కులు... తోటీ దేశస్థుల జాతి విద్వేష వ్యాఖ్యల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు. నడిరోడ్డుపై సహాయం కోసం ఎదురుచూస్తున్న తమపై దారిన పోయేవాళ్లు జాతి పేరుతో దూషించారని ఇంద్రజిత్ కౌర్ అనే ఓ ప్రయాణీకురాలు కంటతడి పెట్టటమే దీనికి నిదర్శనం.

" వెళ్లి ఆ మంటల్లోనే చావచ్చుగా...!" అంటూ తమను అమానుషంగా దూషించారని మిగిలిన ప్రయాణీకులు కూడా వాపోయినట్లు తెలుస్తోంది. మోటార్‌సైకిల్‌పై వచ్చిన దుండగులు జాతివివక్షతోనే తమ బస్సుపై దాడి చేసి ఉండవచ్చన్న అనుమానాన్ని కూడా కౌర్ వ్యక్తం చేయడం గమనార్హం. కాగా... ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments