Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుగుముఖం పట్టిన భారత విద్యార్థులు

Webdunia
ఆస్ట్రేలియాలో వరుసగా జరుగుతున్న జాత్యహంకార దాడులతో భీతిల్లిన భారత విద్యార్థులు దాదాపు 46మంది తమ తమ స్వస్థలాలకు తిరుగుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మెల్‌బోర్న్ కేంద్రంగా పనిచేస్తున్న "ఇండియన్ స్టూడెంట్" మేగజైన్ ఎడిటర్ తిరువల్లమ్ భాసీ స్పష్టం చేశారు.

ఈ విషయమై మెల్‌బోర్న్ నుంచి తిరువల్లమ్ భాసీ ఫోన్లో మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో చదువుకుంటున్న తమ పిల్లలు స్వదేశానికి తిరిగి వచ్చేయాలని చాలా మంది భారత విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారని చెప్పారు. అంతేగాకుండా, త్వరగా తిరిగి రావాలని తమ పిల్లలపై వారు ఒత్తిడి తెస్తున్నారని ఆయన తెలిపారు.

దీంతో... భారతీయ విద్యార్థులను చేర్చుకోరాదని ఆస్ట్రేలియాలోని రెండు యూనివర్సిటీలు కూడా నిర్ణయించినట్లు తిరువల్లమ్ చెప్పారు. అంతేగాకుండా, తమ భద్రతకు భరోసా లేకపోవడంతో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ల వద్ద నుంచి దరఖాస్తులను విద్యార్థులు ఉపసంహరించుకుంటున్నారని ఆయన వివరించారు.

ఈ మేరకు ఇటీవల ఆస్ట్రేలియాలో జాత్యహంకార దాడులకు గురయిన కేరళ యువకులు మానిష్ నాయర్, గౌతమ్‌ తదితరులు తమ స్వస్థలాలకు బయలుదేరి వెళ్లినట్లు తిరువల్లమ్ పేర్కొన్నారు. కాగా... మనీష్ నాయర్, గౌతమ్‌లు ఇద్దరూ మెల్‌బోర్న్‌లోని డేకిన్ యూనివర్సిటీ బర్వుడ్ కాంపస్‌లో ఏంబీఏ విద్యను అభ్యసిస్తున్న సంగతి విదితమే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

Chandra babu: సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో చర్మకారుడు.. వీడియో వైరల్

సారా కాసేవాళ్లే జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారు : బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

Harshali Malhotra: అఖండ2 తాండవం లో దేవదూతలా చిరునవ్వు తో హర్షాలి మల్హోత్రా

Niharika: సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల మూవీ ప్రారంభం

Dil Raju: సినిమా పైరసీ కంటే సోషల్ మీడియా పైరసీ దోపీడితో సమానమే : దిల్ రాజు

Show comments