Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాత్యహంకారానికి తొలి ప్రతీకార చర్య..?

Webdunia
ఆస్ట్రేలియాలో గత కొన్ని వారాలుగా భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న జాత్యహంకార దాడులకు.. భారతీయులు ప్రతీకార చర్యకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నారు. భారత విద్యార్థుల బృందంపై జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన అనంతరం.. ఒక 20 సంవత్సరాల ఆస్ట్రేలియన్ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. మెల్‌బోర్న్ నగర పశ్చిమ శివార్లలో జరిగిన ఈ సంఘటనతో ఉలిక్కిపడ్డ ఆస్ట్రేలియన్లు, భారతీయులు తమపై చేసిన తొలి ప్రతీకార దాడిగా భావిస్తున్నారు.

కత్తిపోట్లకు గురైన ఆస్ట్రేలియా యువకుడు అంతకుమునుపు భారతీయ విద్యార్థులను ఉద్దేశించి జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలతో దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. "మీరు నల్ల జాతీయులు, ఇక్కడి వాళ్లు కాదు. మా దేశం నుంచి వెళ్లిపొమ్మని" దూషించినట్లు "ది ఏజ్" పత్రికా కథనం వెల్లడించింది.

దీంతో భారతీయులపై వరుసదాడులకో అప్పటికే వేదనలో ఉన్న ఆ బృందంలోని యువకులు కోపం పట్టలేక... ఆ ఆస్ట్రేలియన్ యువకుడిని కత్తితో పొడిచి పారిపోయారు. 23, 29 సంవత్సరాల వయసులో ఉన్న ఆ ఇద్దరు భారతీయ విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆ దేశ పోలీసులు వెల్లడించారు.

భారతీయులపై జరుగుతున్న దాడులపై పోలీసులు తగిన చర్య తీసుకోకపోవడం వల్లనే భారతీయులు ఆత్మరక్షణ కోసం ఈ దాడికి పాల్పడ్డారని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి చెప్పినట్లుగా "ది ఏజ్" తన కథనంలో పేర్కొంది. అలాగే... రైల్వేస్టేషన్ల నుంచి రాత్రి వేళల్లో ఇళ్ళకు వెళ్లే భారతీయ విద్యార్థులకు రక్షణ కల్పిస్తున్నామంటూ ఆస్ట్రేలియా పోలీసులు చెప్పుకుంటున్న వార్తల్లో నిజం లేదనీ, పోలీసులు ఇక్కడ ఎవరినీ పట్టించుకోరని ఓ వ్యాఖ్యానించినట్లు ఏజ్ కథనం వివరించింది. కాగా... దాడులను ప్రత్యక్షంగా చూసిన మరో వ్యక్తి కూడా ఈ ఆరోపణలను ధ్రువీకరించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే... మెల్‌బోర్న్‌లో జరిగిన ప్రతీకార దాడిపై విక్టోరియా ఎత్నిక్ కమ్యూనిటీస్ కౌన్సిల్ అధ్యక్షుడు శామ్ అఫ్రా స్పందిస్తూ, ఇది చాలా ప్రమాదకరమైన పరిణామమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా అయితే ఇదో గొలుసుకట్టు వ్యవహారంలాగా తయారవుతుందని, బాధితులే దుండగులుగా మారిపోతారని శామ్ వ్యాఖ్యానించారు. అయితే, భారతీయులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments