జాతి విద్వేషం కేసులో కొరియన్‌కు జరిమానా

Webdunia
FILE
భారత పరిశోధకుడిపై జాతి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసిన నేరానికిగానూ దక్షిణ కొరియా జాతీయుడికి సియోల్‌లోని స్థానిక కోర్టు భారీ జరిమానాను విధించింది. భారతీయ పరిశోధకుడు హుస్సేన్‌పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినందుకుగానూ పార్క్ అనే 31 సంవత్సరాల కొరియన్ యువకుడి ఇంచియాన్ జిల్లా కోర్టు 1 మిలియన్‌వాన్‌ (865 అమెరికన్ డాలర్లు)ల జరిమానా చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. ఒక భారతీయుడిపై జాతి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఒక కొరియావాసికి శిక్ష పడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ సంవత్సరం జూన్ నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన మీడియా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఈ ఘటనలో హుస్సేన్‌ను దుర్వాసన కొట్టుకుంటూ, మురికిగా ఉన్నావంటూ పార్క్ విద్వేష వ్యాఖ్యలు చేశాడు.

ఇదిలా ఉంటే... ఈ ఘటన నేపథ్యంలో పలువురు మానవహక్కుల కార్యకర్తలు తీవ్రంగా స్పందిచారు. అంతేగాకుండా విదేశీయులపై జాతివిద్వేషానికి పాల్పడేవారికి వ్యతిరేకంగా ఒక బిల్‌ను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారని సియోల్‌లోని యోన్‌హ్యా‌ప్ వార్తాసంస్థ పేర్కొంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మధ్యాహ్నం భోజనం కలుషితం... ఆరగించిన 44 మంది విద్యార్థుల అస్వస్థత

పవన్ సార్... మా తండాకు రహదారిని నిర్మించండి.. ప్లీజ్ : దీపిక వినతి

ఇండిగో సంక్షోభం: పండుగ సీజన్‌లో టిక్కెట్ల ధరలు పెరుగుతాయ్- రామ్మోహన్ నాయుడు

గ్రీస్ యువరాణి.. భారత సంతతి మాథ్యూ జెరెమియా కుమార్‌తో ప్రేమలో పడింది.. పెళ్లి ఎలా?

సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి బోణీ.. రాజకీయ పార్టీపై త్వరలో ప్రకటన?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

Show comments