జనలోక్ పాల్ బిల్లు చట్టబద్ధతకై ఎన్నారైలు కొవ్వొత్తుల ప్రదర్శన

Webdunia
బుధవారం, 13 ఏప్రియల్ 2011 (12:39 IST)
WD
అవినీతికి వ్యతిరేఖంగా జనలోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టాలని అన్నాహజారే చేపట్టిన దీక్షకు మద్దతుగా గతవారం హౌస్టన్‌లో ఫిఫ్త్ పిల్లర్ సంస్థకు చెందిన తెలుగు ఎన్నారైలు ఒకరోజు దీక్ష చేసిన విషయం తెలిసిందే.

తదనంతర పరిమాణాల తరువాత ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఫిఫ్త్ పిల్లర్ హౌస్టన్ శాఖా అధ్యక్షడు రాఘవ సోలిపురం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో తమ సంఘీభావాన్ని తెలిపారు.

ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే తప్పకుండా ప్రజల జీవితల్లో వెలుగులు చూడవచ్చని దానికి నిదర్శనంగా ఈ కొవ్వొత్తులతో సంఘీభావ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. మంగళవారం University of Housto nలో జరిగిన సంతకాల సేకరణలో భాగంగా దాదాపు ౩౦౦ మంది విద్యార్థులు Lokpal Bil lను పటిష్టపరచడానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.

ఫిఫ్త్ పిల్లర్ తరఫున అమెరికాలో ఉన్న అన్ని యూనివర్శిటీలలోని భారతీయ విద్యార్థుల మద్దతును కూడగడతామని ఈ బిల్లు కార్యరూపం దాల్చేవరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. బిల్లు గురించి ప్రవీణ్ పోతినేని మాట్లాడుతూ ఈ బిల్లుపై ప్రజలకు ఇంకా చాల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

త్వరలో ఫిఫ్త్ పిల్లర్ ఆ పని చేపడుతుందని తద్వారా బిల్లుపై ప్రజలకు సరైన అవగాహన కల్పిస్తే ప్రజలమద్దతు ఇంకా చాలా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువత ఇంకా పెద్దసంఖ్యలో ఇందులో భాగ్యస్వామ్యులైతే తప్ప మన దేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలపలేమన్నారు.

ప్రపంచకప్‌లో మనదేశం No 1 స్థానాన్ని ఆక్రమించింది కాని అవినీతి రహిత దేశాల్లో మనదేశం 87వ స్థానంలో ఉందన్నారు. మనదేశం No 1 స్థానంలోకి రావాలంటే యువత పెద్దసంఖ్యలో భాగ్యస్వామ్యులవ్వాలని సందీప్ దాడి తెలిపారు
అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అమీన్‌పూర్ హత్య కేసు: ఇద్దరూ కలవకుంటే నా కూతురికి కడుపు ఎలా వచ్చింది?

మంత్రి కొండా సురేఖ అరెస్టు తప్పదా?

రూ. 9500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేబినెట్

ఎస్ఐఆర్ పేరుతో ఓటు తొలగిస్తే కిచెన్ టూల్స్‌తో సిద్ధం కండి.. మహిళలకు మమతా పిలుపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

Show comments