Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ అరెస్టును ఖండించిన ఎన్నారైలు..!

Webdunia
FILE
తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును పోలీసులు అరెస్టు చేయడాన్ని కాలిఫోర్నియాకు చెందిన తెలంగాణా ఎన్నారైలు ముక్తకంఠంతో ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్న కేసీఆర్‌ను అరెస్టు చేయటంపట్ల ఎన్నారై విజయ్ చవ్వ ఓ ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ అసంతృప్తిని, నిరసనను శాంతియుతంగా, ప్రజాస్వామ్య విధానంలో వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉందని విజయ్ చవ్వ పై ప్రకటనలో వెల్లడించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

బే ఏరియాలో ప్రత్యేకంగా సమావేశమైన పలువురు ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించారని చవ్వ వివరించారు. శాంతియుతంగా నిర్వహించే ఆందోళనలకు ఆటంకం కలిగించవద్దని ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన తెలిపారు. సున్నితమైన తెలంగాణ అంశం కోసం ఉద్యమిస్తున్న తెరాస నాయకులు, శ్రేణులు శాంతి, సహనం, సంయమనం పాటించాలని ఎన్నారైలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసిందన్నారు.

అలాగే.. ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుత మార్గంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తున్న వారంతా.. తగిన ఉపయోగకరమైన మార్గాలను ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నారైల ప్రత్యేక సమావేశం సూచించిందని విజయ్ చవ్వ తన ప్రకటనలో తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments