Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలిఫోర్నియాలో పీఆర్పీ "ఎన్నికల హంగామా"

Webdunia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏఫ్రిల్ 16, 23వ తేదీలలో జరిగిన ఎన్నికల ఫలితాలను వెలువరిస్తున్న నేపథ్యంలో... మేనెల 15వ తేదీన రాత్రి 8.30 గంటలకు కాలిఫోర్నియాలో "ఎన్నికల ఫలితాల హంగామా"ను ప్రజారాజ్యం పార్టీ నిర్వహించనుంది.

ఈ విషయమై ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్, ఎన్నారై ప్రజారాజ్యం పార్టీ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి అయిన శ్రీనివాస మానాప్రగడ మాట్లాడుతూ... ఫలితాల రోజున టీవీ9 ద్వారా ఎన్నికల ఫలితాల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజున మరికొన్ని చోట్లు కూడా ఇదేరకంగా ఎన్నిగల ఫలితాల హంగామాను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ హంగామా కార్యక్రమానికి ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాస, భాజపా... తదితర రాజకీయ పక్షాలకు మద్దతు ఇచ్చిన ఎన్నారైలు, మిత్రులు, ఆయా పార్టీల శ్రేయోభిలాషులు హాజరు కావచ్చని మానాప్రగడ ఆహ్వానించారు. ఈ హంగామా నిర్వాహకులు చంద్రు శీలం, శ్రీనివాస మానాప్రగడ, శ్రీకాంత్ పలివెల, రామ్ తోట, శేఖర్ గంజి మాట్లాడుతూ... ఇటీవలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రవాసాంధ్రులు, సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్ర రాజకీయ నాయకులతో భేటీ అవుతున్న సందర్భాల్లో అమెరికాకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తి, ఉత్కంఠ కనబరుస్తున్నారని ఈ సందర్భంగా హంగామా నిర్వహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ ఎన్నికల ఫలితాలను అందరూ అన్ని పార్టీల మద్దతుదారులు ఒకే వేదిక వద్ద కలసి కూర్చొని ప్రత్యక్షంగా తిలకించడం, రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేపట్టబోతున్నది, ఎవరికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పట్టం కట్టబోతున్నారన్న విషయాలను విశ్లేషించుకునేందుకు వీలుగా ఈ 'హంగామా' ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.

ఎన్నికల ఫలితాల హంగామా కార్యక్రమానికి హాజరయ్యే ఉత్సాహవంతులైన ప్రవాసాంధ్రులకు ఆహారం, పానీయాలను అందుబాటులో ఉంచుతున్నట్లు.. మానాప్రగడ తెలియజేశారు. లాస్ ఏంజిల్స్, షికాగో, వాషింగ్టన్ డిసి, అట్లాంటా, న్యూజెర్సీ, న్యూయార్క్, డెట్రాయిట్, డల్లాస్, యుకె, ఐర్లండ్, జర్మనీ, మస్కట్, సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కూడా ఎన్నికల ఫలితాల హంగామా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నామనీ.. ఈ మేరకు ఆయా స్థానిక ప్రవాస చిరంజీవి ఆర్గనైజేషన్ విభాగాలతో సంప్రదిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments