కాంగ్రెస్ పార్టీకి తెలుగు కళాసమితి అభినందన

Webdunia
ఆంధ్రప్రదేశ్‌కు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో అఖండ విజయం సాధించిన అధికార కాంగ్రెస్ పార్టీకి... యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్‌లోని "తెలుగు లలిత కళాసమితి" అభినందనలు తెలియజేసింది. శాసనసభ, లోక్‌సభలలో అడుగుపెడుతున్న నూతన ప్రజా ప్రతినిధులకు యూఏఈలోని తెలుగువారందరి తరపున సమితి ఈ సందర్భంగా శుభాకాంక్షలను తెలిపింది.

అలాగే... శాసనసభలో అడుగు పెట్టబోతున్నప్రజా ప్రతినిధులకు, పాలక పక్షానికి ఈ సందర్భంగా తెలుగు లలిత కళా సమితి కొన్ని విన్నపాలను తెలిపింది. అవేంటంటే... గల్ఫ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు, సామాజిక స్పృహ కలిగిన సమర్థుడైన నాయకుడిని అధికార ప్రతినిధిగా నియమించి, నిరంతర పర్యవేక్షణ చేయించటం.

ఇంకా... రాష్ట్రానికి తిరిగివచ్చిన ప్రవాసాంధ్రులకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించటం, సంయుక్త ఆరబ్ ఎమిరేట్స్‌లో నివసిస్తున్న యావత్తు తెలుగు వారందరినీ సంఘటిత పరిచేందుకు ఓ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం... తదితర సూచనలను కొత్త ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలుగు కళాకమితి ఆశాభావం వ్యక్తం చేసింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పౌరసత్వం సవరణ చట్టం చేస్తే కాళ్లు విరగ్గొడతా : బీజేపీ ఎంపీ హెచ్చరిక

రోడ్డు ప్రమాదానికి గురైన నెమలి, దాని ఈకలు పీక్కునేందుకు ఎగబడ్డ జనం (video)

మొంథా తుఫాను: అనకాపల్లి గిరిజనుల నీటి కష్టాలు.. భారీ వర్షంలో కాలువ నుంచి తాగునీరు

Hurricane Hunters: తుఫాను బీభత్సం.. అయినా అద్భుతం.. వీడియో వైరల్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర సరుకులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

Show comments