Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారై రాజకీయవేత్త ఒప్పాల్‌ ఓటమి

Webdunia
బ్రిటీష్ కొలంబియాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. ప్రముఖ కెనడా-ఇండియన్ రాజకీయ వేత్త, బ్రిటీష్ కొలంబియా అటార్నీ జనరల్ వాలీ ఒప్పాల్ ఓటమి పాలయ్యారు. మొదట జరిగిన పోలింగ్‌లో వాన్‌కెవర్ సమీపంలోని డెల్టా సౌత్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఒప్పాల్ రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు.

అయితే ఆ తరువాత జరిగిన రీకౌంటింగ్‌లో ఒప్పాల్ ప్రత్యర్థి మాజీ మునిసిపల్ కౌన్సిలర్ విక్కీ హంటింగ్టన్ చేతిలో 32 ఓట్ల తేడాతో అనూహ్యంగా పరాజయం పాలయ్యారని కెనడా ఎన్నికల సంఘం వెల్లడించింది. కెనడా ఎన్నికల చట్టాల ప్రకారం మెజారిటీ చాలా తక్కువ ఉన్నట్లయితే రీకౌంటింగ్ జరుపుతారు. తాజాగా జరిపిన రీకౌంటింగ్‌లో విజేతకు తక్కువ మెజారిటీ ఉండటంతో కోర్టు ఆదేశాల ప్రకారం మరోసారి కౌంటింగ్ జరిపే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. కెనడాలో భారతీయ సంతతి ఎక్కువగా ఉండే బ్రిటీష్ కొలంబియాకు అటార్నీ జనరల్‌గా పనిచేసిన ఒప్పాల్.. భారత సంతతి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన నేతగా చెప్పుకోవచ్చు. ఈయన తాజా ఓటమితో 79 మంది సభ్యులు గల బ్రిటీష్ కొలంబియా అసెంబ్లీలో భారత సంతతి సభ్యుల సంఖ్య ఆరుకు చేరినట్లైంది.

కాగా... స్థానిక అంశాలు, హైడ్రో పైప్‌లైన్ విస్తరణ, నియోజకవర్గం గుండా హైవే నిర్మాణం తదితర అంశాలు ఓటర్ల అసంతృప్తికి కారణమయ్యాయని, ఇవే ఒప్పాల్ ఓటమికి దారితీశాయని కెనడా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం ప్రభుత్వంలో దాదాపు రెండో స్థానంలో కొనసాగుతున్న ఒప్పాల్ తాజా ఓటమితో ఖంగుతిన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

Show comments